AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasu Mahesh Reddy: ఆ సమస్య పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే.. ఇంతకీ ఏం జరిగిందేంటే..

ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ టెంట్ వేసుకుని మరీ నిరసన చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు దిగొచ్చిన కాంట్రాక్టర్.. పనులు త్వరలోనే పూర్తి చేస్తామనడంతో.. టెన్షన్‌కు తెరపడింది. ఈ సారి డెడ్‌లైన్ లోపు పనులు పూర్తి కాకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు ఎమ్మెల్యే.

Kasu Mahesh Reddy: ఆ సమస్య పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన వైసీపీ ఎమ్మెల్యే.. ఇంతకీ ఏం జరిగిందేంటే..
Mla Kasu Mahesh Reddy
Shaik Madar Saheb
|

Updated on: Apr 13, 2023 | 9:54 AM

Share

అద్దంకి – నార్కెట్‌పల్లి హైవే.. 1190 కోట్ల రూపాయల వ్యయంతో 212 కిలోమీటర్ల హైవే నిర్మాణం ప్రారంభించారు.. 2012లో ఈ హైవే నిర్మాణం మొదలైనా పిడుగురాళ్లలో మాత్రం వివిధ కారణాలతో బైపాస్ నిర్మాణం ఆగిపోయింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత బైపాస్ నిర్మాణానికి చెందిన అన్ని అనుమతులను క్యూబ్ సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. 2021 జనవరి నాటికి బైపాస్ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా 2022 జనవరి నాటికి పూర్తి చేయాలని సమయం ఇచ్చారు. ఆ తర్వాత 2023 జనవరి.. మార్చి ఇలా డెడ్‌లైన్ మారుతుందే తప్ప.. పనులు పూర్తి కాలేదు.

దీంతో కాంట్రాక్ట్ సంస్థ తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే కాసు మహేష్. ఎన్నిసార్లు చెప్పినా పనులు వేగంగా చేయకపోవడంతో.. విసిగిపోయిన ఎమ్మెల్యే నేరుగా నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దిగొచ్చిన క్యూబ్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేతో బహిరంగంగానే చర్చలు జరిపారు. జూన్ 30 నాటికి బైపాస్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి చేయకుంటే టోల్ నిలిపి వేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

మే ఒకటి తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను బైపాస్ గుండా అనుమతించి మధ్యలో పట్టణం గుండా డైవర్ట్ చేస్తామన్నారు. నర్సరావుపేట, గుంటూరు నుంచి వచ్చే భారీ వాహనాలను మాత్రం ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకూ టౌన్ లోకి అనుమతించమని చెప్పారు. దీంతో నిరసన విరమించారు ఎమ్మెల్యే. జూన్ 30లోపు పూర్తి కాకపోతే ఈ సారి నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు ఎమ్మెల్యే మహేష్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!