Andhra: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాబోయ్ వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరూ గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అతివేగంగా వచ్చిన బైక్.. లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (21), చింతల నాని (21) సూర్యలంక బీచ్‌కి వెళ్లారు. అయితే బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి బాపట్లకు చేరుకున్నారు. సరిగ్గా 2.34 గంటల సమయంలో సూర్యలంక రోడ్డు వైపు నుంచి వస్తూ.. బాపట్ల గడియారం స్తంభం కూడలి వద్ద చీరాల నుంచి గుంటూరు వైపునకు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు అమాంతం ఎగిరిపడి ఘటనా స్థలంలోనే మృతిచెందారు.
వీడియో చూడండి..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బైక్ పై స్పీడుగా వెళ్లి నేరుగా లారీని ఢీకొట్టడంతో ఇద్దరు ఎగరిపడ్డారు. అంతేకాకుండా బైక్ పార్ట్స్ చెల్లాచెదురుగా పడ్డాయి..
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన యువకులు మృతిచెందడంతో.. ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




