AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రోజంతా బైక్‌పై తిరుగుతున్న భార్యాభర్తలు.. కట్ చేస్తే.. అసలు విషయం స్టేషన్‌లో తేలింది

ఆ భార్యాభర్తలు ఇద్దరూ పగటిపూట ఇంట్లో ఉండరు.. రోజంతా ఊరు మీద పడి తిరుగుతుంటారు. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నారని అనుకుంటే పొరపాటే.. వెళ్ళేది ఎక్కడికో తెలిస్తే షాక్ అవుతారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి.

Andhra: రోజంతా బైక్‌పై తిరుగుతున్న భార్యాభర్తలు.. కట్ చేస్తే.. అసలు విషయం స్టేషన్‌లో తేలింది
Guntur
T Nagaraju
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 10, 2025 | 1:34 PM

Share

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరురికి చెందిన కఠారి వెంకటేశ్వర్లు, తేజ నాగమణి భార్యభర్తలు. వ్యవసాయం చేసుకుంటూ జీవించే వీరిద్దరూ పగటి సమయంలో బైక్‌పై తిరుగుతుంటారు. తమ గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పగటి సమయంలో బైక్‌పై ప్రయాణిస్తుంటారు. అయితే వీరు ప్రయాణం ఏ బంధువుల ఇంటికో, ఏ శుభకార్యానికి హాజరు కావడానికో కాదు.. ఎవరెవరి ఇండ్లకి తాళాలు వేసి ఉన్నాయి. వారు ఊరులో ఉన్నారా లేదా పొరుగూరు వెళ్లారా అన్న అంశాలపై ఆరా తీయడానికే ప్రయాణిస్తుంటారు. ఉదయం పూట ప్రయాణం చేసి రెక్కీ చేసుకున్న తర్వాత రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనానికి పొల్పడతారు. అయితే వీరి గుట్టు ఎలా బయటపడిదంటే..

ఇది చదవండి: చిత్తు కాగితాలు అనుకునేరు.. 30 ఏళ్ల క్రితం రూ. వెయ్యి.. ఇప్పుడు రూ. 1.83 కోట్లు

తూములూరికే చెందిన మధుసూధనరావు గత నెల 28న ఊరు వెళ్లి రెండో తేదిన తిరిగి వచ్చాడు. అతను వచ్చే సమయానికే ఇంట్లో చోరి జరిగింది. దీంతో మధుసూధనరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ సాయంతో వెంకటేశ్వర్లను గుర్తించారు. అతన్ని ప్రశ్నించగా భార్యతో కలిసి తానే చోరికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఇదొక్క చోటే కాదు పదమూడు చోట్ల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిద్దరి వద్ద నుండి 173 గ్రాముల బంగారు ఆభరణాలు, 226 గ్రాముల వెండి, రెండు లక్షల పదిహేను వేల రూపాయల నగదు, ఒక టివి స్వాధీనం చేసుకున్నారు.

అయితే వీరిపై అనుమానం రాకుండా ఉండేందుకు కేవలం తమ గ్రామంతో పాటు మండలంలో మాత్రమే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. దొంగతనం సమయంలో వీరి కదలికలు కనిపించినా మొదట అనుమానం రాకుండా ఉండేందుకు భార్యతో కలిసి బైక్‌పై ప్రయాణించే ఉండేవాడని తెలిపారు. భార్య కూడా భర్తతో కలిసే దొంగతనాల్లో పాల్గొనేదన్నారు. సుదీర్ఘకాలంగా పోలీసులకు దొరకకుండా ఉన్న జంటను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.

ఇది చదవండి: పాత బంగారాన్ని ఇచ్చి కమ్మలు కొంటానంది.. కట్ చేస్తే.. తను ఏం చేసిందంటే