Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలంలో ట్రాఫిక్‌ నియంత్రణపై పాలక మండలి సమావేశం

శక్తి పీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట వెలసిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా క్షేత్రంలో అత్యంత క్లిష్టంగా, కష్టంగా మారిన ట్రాఫిక్ సమస్యపై ఎట్టకేలకు పాలక మండలి దృష్టి సారించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్ర పాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ..

Follow us
J Y Nagi Reddy

| Edited By: Srilakshmi C

Updated on: Dec 26, 2023 | 10:06 AM

నంద్యాల, డిసెంబర్ 26: శక్తి పీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట వెలసిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహా క్షేత్రంలో అత్యంత క్లిష్టంగా, కష్టంగా మారిన ట్రాఫిక్ సమస్యపై ఎట్టకేలకు పాలక మండలి దృష్టి సారించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్ర పాణిరెడ్డి, ఈవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో డి.పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈసమావేశంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ.. క్షేత్రానికి సెలవులు, పర్వదిన రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో క్షేత్రపరిధిలో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ట్రాఫిక్ నియంత్రణకై క్షేత్రపరిధిలో మరికొన్ని వాహన పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్, సూచిక బోర్డులు, పబ్లిక్ అవుటో పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ క్షేత్రపరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరియైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటిని తొలగించేందుకు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని, దేవస్థానం ప్రైవేటు సెక్యూరిటీని కూడా పెంచాలని, అదనంగా మరో 50 మంది హోమ్ గార్డులను నియమించుకోవాలని ఆలయ ఈవో పెద్దిరాజుకు అధికారులకు డీఎస్పీ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.