“మీలాంటి వారే.. ఒక రూపాయి చేపకి 20 రూపాయిల మసాలా దినుసులు కొన్నారంట!” : బుచ్చయ్య ‘జగనన్న టమోటో’ కామెంట్
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ పోలీస్ యాప్ కు వైసీపీ రంగులు..
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాజాగా జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఏపీ పోలీస్ యాప్ కు వైసీపీ రంగులు అంటించారంటూ ఆయన దుయ్యబట్టారు. “రంగులు మా హక్కు అన్న రీతి లో ప్రభుత్వం ఉంది అనుకుంటా…! ఆఖరికి ఏపీ పోలీస్ యాప్ కి కూడా రంగులు అంటించారు!”. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంతేకాదు, రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపైనా గోరంట్ల వైసీపీ సర్కారుకు చురకలంటించే ప్రయత్నం చేశారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి నాది ఒక సలహా.. మీరు ఇచ్చే 20 రూపాయిల బియ్యం కోసం 50 రూపాయిలు ఖర్చు పెట్టి వాహనాలు.. మరల రోజు వారీ ఇంధన ఖర్చులు, పైగా వాహనం ఎప్పుడు వస్తుంది అని సంచి పట్టుకుని ఎదురు చూపులు..ఇదంతా కాకుండా, స్విగ్గి, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా లాంటి వాటితో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా మూడు పూటలా ఆహారం ఇంటికి పంపేయండి! లేకపోతే జోమెటో లాగా “జగనన్న టమోటో” పెట్టి ఇంటికి ఇచ్చేయండి…! మీ లాంటి వారే ఒక రూపాయి చేప కి 20 రూపాయిల మసాలా దినుసులు కొన్నారు అంట!” అంటూ సెటైర్లు వేశారు బుచ్చయ్య.
రంగులు మా హక్కు అన్నా రీతి లో ప్రభుత్వం ఉంది అనుకుంటా…! @ysjagan
ఆఖరికి ఏపీ పోలీస్ యాప్ కి కూడా రంగులు అంటించారు! @dgpapofficial#GBC? pic.twitter.com/alIJzW08Zo
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 7, 2021
స్విగ్గి,ఉబర్ ఈట్స్,ఫుడ్ పాండా లాంటి వాటితో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా మూడు పూటలా ఆహారం ఇంటికి పంపేయండి!లేకపోతే జోమెటో లాగా “జగనన్న టమోటో” పెట్టి ఇంటికి ఇచ్చేయండి…! మీ లాంటి వారే ఒక రూపాయి చేప కి 20 రూపాయిల మసాలా దినుసులు కొన్నారు అంట!#గోరంట్ల?#F3CMJagan#JaganannaTommato
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 7, 2021
తన పదవికి గుడ్ బై చెప్పిన ట్విట్టర్ ఇండియా పాలసీ అధిపతి మహిమా కౌల్, కారణం ఎందుకంటే.?
ఉత్తరాఖండ్ విలయం: తపోవన్ టన్నెల్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి, సహాయక చర్యలు నిలిపివేత