AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ ద్వారా బాలయ్యబాబు పంచాయతీ ఎన్నికల ప్రచారం, సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్ల మీదకి వస్తానని హామీ

సిల్వర్‌ స్క్రీన్‌పై ఆయన డైలాగులకు విజిల్సే విజిల్స్. పొలిటికల్ స్క్రీన్‌పైనా అలాంటి డైలాగ్సే పేలుస్తున్నారు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నెల్లూరు జిల్లాలోని ఫ్యాన్స్‌తో ఆదివారం

ఫోన్‌ ద్వారా బాలయ్యబాబు పంచాయతీ ఎన్నికల ప్రచారం, సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్ల మీదకి వస్తానని హామీ
Venkata Narayana
|

Updated on: Feb 08, 2021 | 3:11 AM

Share

సిల్వర్‌ స్క్రీన్‌పై ఆయన డైలాగులకు విజిల్సే విజిల్స్. పొలిటికల్ స్క్రీన్‌పైనా అలాంటి డైలాగ్సే పేలుస్తున్నారు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నెల్లూరు జిల్లాలోని ఫ్యాన్స్‌తో ఆదివారం మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని కామెంట్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై బాలయ్యబాబు పలు విమర్శలు గుప్పించారు. ‘రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోంది.. మన దురదృష్టం’ అంటూ బాలయ్య వాపోయారు. నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోటకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఫోన్‌ ద్వారా పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు. పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగులతో తన మార్క్‌ చూపించారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పాలన చూశామని బాలయ్య ఈ సందర్భంగా అన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్లమీదకి వస్తానని, ప్రజలందర్నీ కలుసుకుంటానని చెప్పారు. అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో తనది జన్మజన్మల అనుబంధమన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సహించనన్నారు. కావలి కేడర్‌లో ఫుల్‌ జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేయడం ఇప్పుడే కాదు.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఈమధ్యే పర్యటించిన ఆయన.. వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలతో అభివృద్ధి ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుల్ క్లాసు పీకిన కేసీఆర్, అధినేత హెచ్చరికలతో కంగుతిన్న పార్టీ నాయకులు, మరోసారి ఆ టాపిక్ తీయొద్దంటూ గుసగుసలు.!