Airline Services: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి ప్రత్యేక విమానం.. ఎప్పటినుంచంటే..!
Airline Services: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి ప్రత్యేక విమాన సరస్వీసులు త్వరలో..
Airline Services: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తూర్పుగోదావరి జిల్లా నుంచి తిరుపతికి ప్రత్యేక విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చేనెల (మార్చి) 28వ తేదీ నుంచి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి విమాన సర్వీస్‌ను ప్రారంభిస్తారు. తిరుమలకు భక్తుల రద్దీ, ఇతర అంశాలన్నీ పరిగణనలోకి ఈ విమాన సర్వీసును నడిపేందుకు సిద్ధమైనట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు విమాన ప్రయాణాలు సాగుతున్నాయి. తాజా నిర్ణయంతో తిరుపతికి కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాన్నాయి. ఈ నిర్ణయంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
ఫోన్ ద్వారా బాలయ్యబాబు పంచాయతీ ఎన్నికల ప్రచారం, సినిమా షూటింగ్ పూర్తయ్యాక రోడ్ల మీదకి వస్తానని హామీ
Donations for Ram Mandir: అయోధ్య రామమందిరానికి విరాళాలు అందజేసిన ముస్లింలు, క్రైస్తవ కమిటీ సభ్యులు..