Road Accident: ప్రకాశం జిల్లాలో విషాదం.. ఢీకొన్న ఆటో, లారీ.. ఐదేళ్ల చిన్నారి మృతి..
Road Accident: ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
Road Accident: ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జిల్లాలోని కంభం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రం గుండా వెళ్తున్న అనంతపురం టు అమరావతి రహదారిపై లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలోనూ ఇద్దరి పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. ప్రమాదానికి గురైన ఐదుగురు బెస్తవారిపేట పట్టణానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా కంభంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
రేపు చెన్నైకు చేరుకోనున్న చిన్నమ్మ.. శశికళకు స్వాగతం పలికేందుకు అభిమానుల భారీ ఏర్పాట్లు
కదన రంగంలో కనకదుర్గలు.. తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌లో మహిళా కోబ్రా కమెండోలు