నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ ఇద్దరు బాలుర మృతి
గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
Children death with flying kite : గాలిపటం సరదా ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది… గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం లోని గౌతమ్‌నగర్‌లో గాలిపటాలు ఎగరేస్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. దీంతో పుంగళూరు రాజేష్(11),నక్కా దినేష్ (8 ) అనే ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు.
పొలాల్లో గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో.. గాలి పటాలు 11కేవీ విద్యుత్ లైన్ కు తగిలి విద్యుత్ షాక్ తో అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన చిన్నారులు. దీంతో రెండు కుటుంబాలు తీవ్ర దు:ఖ సాగరంలో మునిగిపోయాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి… Road Accident : రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి.. విషాదంలో వెస్టిండీస్ ప్లేయర్లు..