Road Accident : రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి.. విషాదంలో వెస్టిండీస్ ప్లేయర్లు..
రోడ్డు ప్రమాదం ఓ మాజీ క్రికెటర్ ను బలిగొంది. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎజ్రా మోసెలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 1990లలో ఎజ్రా విండీస్ తరపున..
Road Accident : రోడ్డు ప్రమాదం ఓ మాజీ క్రికెటర్ ను బలిగొంది. వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ ఎజ్రా మోసెలీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 1990లలో ఎజ్రా విండీస్ తరపున రెండు టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. శనివారం బార్బడోస్ ఏబీసీ జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. ఎజ్రా మోసెలీ ప్రయాణిస్తున్న సైకిలును ఓ కారు వేగంగా ఢీకొట్టడంతో ఎజ్రా మృతి చెందినట్టు అక్కడి మీడియా తెలిపింది. ఎజ్రా మృతి తమను తీవ్రంగా కలచివేసిందని క్రికెట్ వెస్టిండీస్ డైరెక్టర్ జిమ్మీ ఆడమ్స్ పేర్కొన్నారు. ఆయన మృతి విషయం తెలిసి సీడబ్ల్యూఐ విషాదంలో మునిగిపోయిందన్నారు. వెస్టిండీస్ ప్లేయర్స్ మృతి సంతాపం తెలుపుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
లేడీ జడ్జిపై మనసుపడ్డ నేరస్థుడు.. చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు..ఆతర్వాత…