లేడీ జడ్జిపై మనసుపడ్డ నేరస్థుడు.. చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు..ఆతర్వాత…

ప్రేమ ఎవరికీ ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము .. అసలే వ్యాలంటైన్స్ డే దగ్గర్లో ఉంది. ప్రేమికులంతా ఎంతో ఆనందంగా ఆ రోజుకు ఎదురుచూస్తున్నారు...

  • Rajeev Rayala
  • Publish Date - 8:42 pm, Sun, 7 February 21
లేడీ జడ్జిపై మనసుపడ్డ నేరస్థుడు.. చాలా అందంగా ఉన్నారంటూ ప్రపోజ్ చేసిన నిందితుడు..ఆతర్వాత...

ప్రేమ ఎవరికీ ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము .. అసలే వాలెంటైన్స్ డే దగ్గర్లో ఉంది. ప్రేమికులంతా ఎంతో ఆనందంగా ఆ రోజుకు ఎదురుచూస్తున్నారు.  కొంతమంది లవర్స్ డే రోజు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ విచిత్రమైన లవ్ ప్రపోజల్ జరిగింది. విచిత్రమంటే అలాంటిదిలాంటిది కాదు. ఏకంగా జడ్జికే ఐ లవ్ యు చెప్పాడు ఓ ఘనుడు.

వివరాల్లోకి వెళ్తే.. డెమెట్రియస్ లూయిస్ అనే వ్యక్తి ఇటీవల ఓ దొంగతనం కేసులో పోలీసులకు చిక్కాడు. దాంతో అతడిని అధికారులు కోవిడ్ కారణంగా జూమ్ కాల్ ద్వారా తబితా బ్లాక్‌మాన్ అనే మహిళా జడ్జి ముందు హాజరుపరిచారు. జడ్జి నిందితుడి శిక్షకు సంబంధించిన పత్రాన్ని చదువుతుండగా లూయిస్ ఒక్కసారిగా ‘మీరు చాలా అందంగా ఉన్నారు.. మీతో ఈ మాట చెప్పేతీరాలి .. ఐ లవ్ యూ..’ అని అన్నాడు… ‘మీరు చాలా అందంగా ఉన్నారు.. మీతో ఈ మాట చెప్పేతీరాలి .. ఐ లవ్ యూ..’ అని చెప్పేశాడు. దీంతో ఆ వీడియో కాల్‌లో ఉన్నవారంతా  ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే లూయిస్ ప్రపోజల్ విన్న లేడీ జడ్జి  .. ‘పొగడ్తలు నీకు ఎక్కడైనా ఉపయోగపడచ్చు కానీ ఇక్కడ మాత్రం ఆ పొగడ్తలు పనిచేయవు’ అంటూ సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

sesame seeds benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నువ్వులు తింటే ఎన్ని లాభాలునున్నాయో తెలుసా..