తొలివిడత పంచాయతీ పోరుకు ముగిసిన ప్రచారం.. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ్టితో ఎన్నికలకు ప్రచారం ముగిసింది
AP Local body Elections 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరగకుండానే పంచాయతీ ఎన్నికల కాక పుట్టిస్తున్నాయి. మొదటి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎన్నికల నిర్వహణపై పోరు వాడీ-వేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ్లితో ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు, వార్డు సభ్యులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకూ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమకు ఓటు వేయాలని కోరుతూ వీధివీధికీ, ఇంటింటికీ తిరుగుతూ చిత్ర విచిత్రంగా ప్రదర్శనలు చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
తొలిదశలో 3,249 పంచాయతీల పరిధిలో 32,502 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో 518 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మంగళవారం 2,731 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈనెల 9న ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి సర్పంచ్‌ను ప్రకటిస్తారు. మరోవైపు, మంగళవారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసి, పోలింగ్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న రెండో దశ, ఫిబ్రవరి 17న మూడో దశ, ఫిబ్రవరి 21న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి..
Read Also… Vizag Steel Plant : కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాం – Daggubati Purandeswari