AP Corona Bulletin : ఏపీ కరోనా బులెటిన్ విడుదల.. గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..!
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,528కి చేరింది. ఇందులో 1,003 యాక్టివ్ కేసులు ఉండగా..
AP Coronavirus Cases : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,528కి చేరింది. ఇందులో 1,003 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,366మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక నిన్న 82 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,33,45,522 సాంపిల్స్‌ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 3, చిత్తూరు 14, తూర్పుగోదావరి 3, గుంటూరు 15, కడప 2, కృష్ణా 12, కర్నూలు 3, నెల్లూరు 8, ప్రకాశం 1, శ్రీకాకుళం 3, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 0 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
ఇవి కూడా చదవండి :
India vs England : కోహ్లీ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. లంచ్ విరామానికి టీమిండియా స్కోర్ 59/2 Corona Cases Telangana : తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య ఎంతంటే..!