కదన రంగంలో కనకదుర్గలు.. తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌లో మహిళా కోబ్రా కమెండోలు

అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. స్త్రీలు స్వాభిమానంతో తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఎర్రదండుకు కంచుకోటల్లాంటి కారడవుల్లో.. సయ్యంటూ సవాళ్లకు ఎదురెళ్లబోతున్నారు.

కదన రంగంలో కనకదుర్గలు..  తొలిసారిగా సీఆర్‌పీఎఫ్‌లో మహిళా కోబ్రా కమెండోలు
Follow us

|

Updated on: Feb 07, 2021 | 10:06 PM

women cobra commandos : నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు. స్త్రీలు స్వాభిమానంతో తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. ఎర్రదండుకు కంచుకోటల్లాంటి కారడవుల్లో.. సయ్యంటూ సవాళ్లకు ఎదురెళ్లబోతున్నారు మన మహిళా కమాండోస్‌. మగవారికే పరిమితమనుకున్న చోట…మెరికల్లా తయారవుతున్నారు ఉమెన్‌ వారియర్స్‌.

తొలిసారిగా కోబ్రా కమెండో యూనిట్‌లో మహిళా కమెండోల్ని రంగంలోకి దించుతోంది సీఆర్‌పీఎఫ్. కోబ్రా అంటే.. కమెండో బెటాలియన్‌ ఫర్‌ రిజల్యూట్‌ యాక్షన్‌. కీకారణ్యాల్లోనూ విల్లువిడిచిన బాణాల్లా దూసుకుపోయే సుశిక్షిత కమెండోల ప్రత్యేక దళం. ఇప్పటిదాకా పురుషులే బాధ్యతలు నిర్వహించిన సవాళ్లతో కూడుకున్న కోబ్రా దళాల్లోకి.. ఫస్ట్‌ టైమ్‌ ఎంట్రీ ఇచ్చారు మహిళా కమెండోలు. వేర్పాటువాదం, వామపక్ష ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో విధులంటే ప్రాణాలతో చెలగాటమే. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన శత్రువు ఏ క్షణం ఎటువైపునుంచి విరుచుకుపడతాడో తెలీదు. అలాంటి ఛాలెంజింగ్‌ విభాగంలోకి మొదటిసారి మహిళలను రిక్రూట్‌ చేసుకుంది సీఆర్‌పీఎఫ్‌. దేశవ్యాప్తంగా 6 మహిళా బెటాలియన్ల నుంచి 34 మంది మహిళాజవాన్లను కోబ్రా కమెండో ట్రైనింగ్‌కి సెలెక్ట్‌ చేసింది. వారికి అత్యంత కఠినమైన ట్రైనింగ్‌ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక మహిళా కోబ్రా కమెండోల్ని వార్‌ జోన్‌లోకి దించనున్నట్లు సమాచారం.

మావోయిస్ట్‌ వ్యతిరేక ఆపరేషన్ల కోసం 2009లో కోబ్రా దళాన్ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి కేవలం పురుషులే ఈ దళంలో పనిచేస్తూ వచ్చారు. 2008–09లో సీఆర్‌పీఎఫ్‌లో మరో రెండు కోబ్రా బెటాలియన్లను అంతర్గతంగా ఏర్పాటుచేశారు. 2009–10లో ఈ బెటాలియన్ల సంఖ్యని నాలుగుకు పెంచారు. 2010–11లో మరో నాలుగు బెటాలియన్లు ఏర్పడ్డాయి. మొత్తం 12వేల మంది కమెండోలున్న కోబ్రా దళాల్లోకి…ఫస్ట్‌ టైమ్‌ మహిళా జవాన్లని సెలెక్ట్‌ చేశారు. శిక్షణ పొందుతున్న 34 మంది మహిళా జవాన్లు స్వచ్ఛందంగా కోబ్రా కమెండోలుగా పనిచేసేందుకు ముందుకొచ్చారు. తాము ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమంటున్నారు కోబ్రా ట్రైనింగ్‌కి ఎంపికైన మహిళా కమెండోలు. వీరేకాదు…దాదాపు 200మంది మహిళా జవాన్లు కోబ్రా దళాల్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

ప్రతికూల పరిస్థితుల్లోనైనా మనుగడ సాగించేలా, ఒంటరిగానైనా శత్రువును ఎదిరించేలా కోబ్రా కమెండోలకు కఠోర శిక్షణ ఇస్తున్నారు. ట్రైనింగ్‌ తర్వాత పురుష కమెండోలతో కలిపి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లో మహిళా కమెండోలను మోహరిస్తారు. దీంతో అన్ని రంగాల్లోనూ వనితకు తిరుగులేదనిపిస్తున్నారు.

Read Also… దేశవ్యాప్తంగా జోరందుకున్న కోవిడ్ వ్యాక్సినేషన్.. టీకా పంపిణీలో ప్రపంచంలో భారత్ మూడో స్థానం

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో