Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్‌న్యూస్‌.. పీఆర్సీపై కీలక ప్రకటన

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో పీఆర్‌సీ కోసం ఉద్యోగులు ఆందోళన మొదలు పెట్టారు. అయితే..

CM Jagan: ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గుడ్‌న్యూస్‌.. పీఆర్సీపై కీలక ప్రకటన
Follow us
Subhash Goud

|

Updated on: Dec 03, 2021 | 6:30 PM

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో పీఆర్‌సీ కోసం ఉద్యోగులు ఆందోళన మొదలు పెట్టారు. అయితే భవిషత్తు కార్యచరణపై సీఎం సమీర్‌ శర్మకు ఇప్పటికే నోటీసులు సైతం అందించారు. పీఆర్‌సీ పై వారం రోజుల్లోగా ప్రభుత్వం స్పందించినట్లయితే ఉద్యమం బాటపడతామని హెచ్చరించాయి. అయితే తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన చేశారు. తిరుపతిలోని సరస్వతి నగర్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జగన్‌ను ఉద్యోగులు కలిశారు. పీఆర్సీ గురించి జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పందించి పీఆర్సీ పూర్తయిందని, వారం రోజుల్లోగా ప్రకటిస్తామని తెలిపారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు. దీంతో ఉద్యోగులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌ చెప్పినట్లయింది.

అయితే పీఆర్సీని ప్రభుత్వం విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని కొద్ది రోజులుగా ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి జగన్‌ పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పీఆర్సీ సహా ఆర్థిక, ఆర్థికేతర విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలో చర్చలు జరుపుతోంది. డిసెంబర్‌ 7 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్న తరుణంలో చర్చలకు ఆహ్వానించింది. సచివాలయంలో కార్యదర్శుల కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశం అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇక తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ను కలిసిన కొందరు ఉద్యోగులకు సీఎం ఈ పీఆర్సీ ప్రకటన చేశారు.

పీఆర్సీపై స్పందించిన బండి శ్రీనివాస్‌

అయితే ఏపీ ఉద్యోగులకు అధికారులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆందోళన కొనసాగుతుందని ఉద్యోగులు తేల్చి చెప్పారు. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. పీఆర్సీ నివేదికలో ఉన్న సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పీఆర్సీ నివేదిక ఇవ్వలేమని, సీఎం జగన్‌ హామీ మేరకు 10 రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక పీఆర్సీపై సానుకూల స్పందన రాలేదని, ఈ నెల 7 నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీతో పాటు మిగిలిన అంశాలను కూడా పరిష్కరించాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి:

Andhra Pradesh: దేవినేని ఉమ ఇంట విషాదం.. గుండె పోటుతో మాజీ మంత్రి తండ్రి కన్నుమూత..

Srikakulam: ఉద్ధానంలో ఎలుగు బంటి హల్‌చల్‌.. తరిమికొట్టిన గ్రామస్తులు..