Srikakulam: ఉద్ధానంలో ఎలుగు బంటి హల్‌చల్.. తరిమికొట్టిన గ్రామస్తులు..
ఎలుగుబంట్ల సంచారం శ్రీకాకుళం జిల్లా వాసులను కలవరపెడుతోంది. సమీప అటవీ ప్రాంతాల్లో నుంచి జనవాసాల్లోకి ఎలుగు బంట్లు వస్తుండడంతో వారు భయాందోళనకు గురువుతున్నారు
ఎలుగుబంట్ల సంచారం శ్రీకాకుళం జిల్లా వాసులను కలవరపెడుతోంది. సమీప అటవీ ప్రాంతాల్లో నుంచి జనవాసాల్లోకి ఎలుగు బంట్లు వస్తుండడంతో వారు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో ప్రధానంగా ఉద్ధానం పరిసరప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా పల్లెసారధిలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. రాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చేసింది. వీధుల్లో పరుగులు తీస్తూ గ్రామస్తులను భయపెట్టింది. అయితే గ్రామస్తులు కర్రలు తీసుకుని తరమడంతో ఎలుగుబంటి సమీప తోటల్లోకి వెళ్లిపోయింది. కాగా గత కొన్ని రోజులుగా ఇది జరుగుతుందని, అటవీ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని పల్లెసారధి గ్రామస్తులు కోరుతున్నారు.
కాగా గత నెలలో అంబుగాం గ్రామంలోని ఓ పరిశ్రమలోకి చొరబడేందుకు ఎలుగుబంటి ప్రయత్నించింది. పరిశ్రమ చుట్టూ ఉన్న రేకులను ధ్వంసం చేసింది. అంతకుముందు వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని పలుగ్రామాల్లోనూ ఇలాంటి సంఘటనలు సంభవించాయి. దీంతో శ్రీకాకుళం జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Also Read:
Andhra Pradesh: దేవినేని ఉమ ఇంట విషాదం.. గుండె పోటుతో మాజీ మంత్రి తండ్రి కన్నుమూత..
AP Weather: జోవాద్ ఎఫెక్ట్.. నేడు, రేపు ఏపీలో పరిస్థితి ఇలా ఉండనుంది.. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు