AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: రైల్వేస్టేషన్ దగ్గర తేడాగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. అనుమానంతో చెక్ చేయగా..

వైజాగ్ టు కేరళ వయా రేణిగుంట.. అక్రమ రవాణాకు రైల్వే స్టేషనే అడ్డా.. అక్రమ రవాణాకు ఈజీ వే గా మార్చుకున్న కొన్ని ముఠాలు.. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాయి. దీనిపై నిఘా పెంచిన పోలీసులు.. గంజాయి ముఠాల భరతం పడుతున్నారు.

Andhra: రైల్వేస్టేషన్ దగ్గర తేడాగా కనిపించిన నలుగురు వ్యక్తులు.. అనుమానంతో చెక్ చేయగా..
Renigunta Railway Station
Raju M P R
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 20, 2025 | 11:08 AM

Share

వైజాగ్ టు కేరళ వయా రేణిగుంట.. అక్రమ రవాణాకు రైల్వే స్టేషనే అడ్డా.. అక్రమ రవాణాకు ఈజీ వే గా మార్చుకున్న కొన్ని ముఠాలు.. గత కొంతకాలంగా పెద్ద ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాయి. దీనిపై నిఘా పెంచిన పోలీసులు.. గంజాయి ముఠాల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే రేణిగుంట జంక్షన్ పై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఒరిస్సా, బరంపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయి ముఠాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు.. స్మగ్లర్ల పై కొరడా ఝుళిపిస్తున్నారు. రైళ్లలో సిబ్బంది కొరతతో తనిఖీలు అంతంత మాత్రమే ఉండడంతో స్మగ్లింగ్ కు సేఫ్ గా మార్చుకున్న గంజాయి ముఠా.. రేణిగుంట జంక్షన్‌లో అడ్డంగా దొరికి పోతున్నారు. ఇందులో భాగంగానే రేణిగుంట అర్బన్ పోలీసులు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఏ మాత్రం అనుమానం వచ్చినా.. అందరినీ తనిఖీ చేస్తున్నారు. ఇలా నిన్న రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో కార్ పార్కింగ్ సమీపంలో అనుమానితుల్ని నలుగురిని గుర్తించారు. వారి వాలకం వేరుగా ఉండడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వారి నుంచి పెద్ద ఎత్తున గంజాయ్ స్వాధీనం చేసుకున్నారు.

3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంజాయితో పట్టుబడ్డ నలుగురు పలు ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భరత్, దినేష్, నితీష్, ఒరిస్సాకు చెందిన జోగిందర్‌లను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నలుగురులో ఇద్దరు మైనర్లు కాగా మరో ఇద్దరు మేజర్లుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

శ్రీకాళహస్తిలో మరొకరు అరెస్ట్..

ఇక టెంపుల్ టౌన్ శ్రీకాళహస్తిలో గంజాయి అక్రమ వ్యాపారం పై ఫోకస్ పెట్టిన పోలీసులు స్మగ్లర్ల పని పడుతున్నారు. రెండు నెలల క్రితం నమోదైన గంజాయి కేసులో తమిళనాడుకు చెందిన గోకుల్ కృష్ణన్ ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ పిఎస్ పరిధిలో గంజాయి తరలిస్తూ పరారైన నిందితుడిని పిటి వారెంట్ పై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ జైలులో పలు కేసుల్లో నిదితుడిగా శిక్ష అనుమావిస్తున్న గోకుల్ కృష్ణన్ ను పీటీ వారెంట్ పై తీసుకొచ్చి శ్రీకాళహస్తి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..