Guntur: కాలేజ్‌ ఎదుట అనుమానాస్పదంగా యువకులు.. వారిని పట్టుకుని.. బ్యాగులు ఓపెన్ చేయగా..

మత్తు రవాణా ఆగడం లేదు. పోలీసులను ఈజీగా మాయచేస్తున్నారు స్మగ్లింగ్ రాయుళ్లు. సిటీల్లోకి తేలిగ్గా గంజాయిని తెచ్చేస్తున్నారు.

Guntur: కాలేజ్‌ ఎదుట అనుమానాస్పదంగా యువకులు.. వారిని పట్టుకుని.. బ్యాగులు ఓపెన్ చేయగా..
Youth Held With Cannabis
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2022 | 8:04 PM

మత్తు పదార్థాలకు యువకులు బానిసలుగా మారుతున్నారు. గుంటూరు శివారులో స్టూడెంట్స్‌ టార్గెట్‌గా గంజాయ్‌ రవాణా సాగుతోంది. ఎన్ని సార్లు పట్టుకున్నా స్మగ్లర్లు రూట్‌ మార్చి సిటీస్‌కు సరఫరా చేస్తున్నారు. పక్కా నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్న ముఠా.. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా మత్తును చేర వేస్తున్నారు. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న స్మగ్లర్లు.. నగరాలతో పాటు.. కాలేజీలు ఎక్కువగా ఉన్నా ప్రాంతాలను సెలక్ట్‌ చేసుకుంటున్నారు. పోలీసులు, నిఘా కళ్లు గప్పి మత్తు రాయుళ్లకు చేర వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గుంటూరు శివారులో ఎక్కువగా జరుతున్నాయి.  అంతా కవరింగే.. అన్నీ కవర్లే.. లోనంతా గుప్పుమనే గంజాయి. పైగా ఎండిపోయింది. వీలైతే ఆకులనే అమ్మేస్తారు. కుదరకుంటే పొడిగా చేసి సిగరెట్లలో నింపేస్తారు. అదీ వీలుకాకుంటే చిన్న చిన్న స్ట్రిప్‌లలో గంజాయి పౌడర్‌ నింపేసి ప్యాకెట్ల రూపంలోకి మార్చేస్తారు. ఈ వ్యవహారం ఎంత గుట్టుగా సాగుతుందో అంతే సీక్రెట్‌గా బట్వాడా జరుగుతుంది.

తాజాగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలోని మెడికల్ కాలేజ్ ఎదురు ఉన్న రైల్వే ట్రాక్ వద్ద కొందరు యువకులు అనుమానాస్పదంగా సంచరించడం పోలీసుల కంటపడింది. చూస్తే స్టూడెంట్స్ మాదిరిగా లేరు. కానీ కాలేజ్ బ్యాగులు ఉన్నాయి. వారి వాలకం తేడాగా ఉండటంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.. వెంటనే యాక్షన్‌లోకి దిగి వారిలో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వాద్ద ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా.. లోపల భారీ ఎత్తున గంజాయి ఉంది. మరో ఇద్దరు యువకులు రైల్వే ట్రాక్ గోడ దూకి బ్రాడీపేటలోకి పారిపోయారు. అదుపులో ఉన్న ఇద్దరు నిందితులను విచారణ జరుపుతున్నారు పోలీసులు. పారిపోయిన వారి కోసం సెర్స్ ఆపరేషన్ షురూ చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత కొంతంగా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సరఫరా రోజు రోజుకూ పెరిగిపోతుంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కు పాదం మోపుతున్నా.. మత్తు బెళ్లాలకు అడ్డుకట్ట పడడం లేదు. గంజాయి సరఫరా ఏ రాష్ట్రంలో బయట పడ్డా.. ములాలు ఏపీలో ఉంటున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి భారీగా అక్రమంగా గంజాయి రవాణా అవుతోంది. దీంతో ఆ ప్రాంతాల్లో పోలీసులు ఇంకాస్త ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..