కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో వినూత్న కార్యక్రమం..కరోనా బాధితులకు ఉచిత వాహనాలు ఏర్పాటు

కడపజిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 8 ఉచిత కరోనా వాహనాలను మున్సిపల్ కమిషనర్ రాధ ప్రారంభించారు....

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో వినూత్న కార్యక్రమం..కరోనా బాధితులకు ఉచిత వాహనాలు ఏర్పాటు
Corona Patients
Follow us

|

Updated on: May 01, 2021 | 10:26 PM

కడపజిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 8 ఉచిత కరోనా వాహనాలను మున్సిపల్ కమిషనర్ రాధ ప్రారంభించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కోవిడ్ బారిన పడిన వారిని ఆసుపత్రికి, క్వారంటైన్ కేంద్రానికి తరలించేందుకు ఈ వాహనాలను ఉపయోగిస్తామన్నారు. కోవిడ్ పేషంట్లు ఎవరైనా ఈ వాహనాలను పూర్తి ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 24 గంటలు ఈ వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు.

పట్టణంలో పలు పాయింట్లను గుర్తించి, ప్రజలకు వాహనాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందించామని కమిషనర్‌ వెల్లడించారు. ఇందులో 1వ వార్డు నుంచి 5వ వార్డుల వరకు వైఎంఆర్‌ కాలనీలోని హెల్త్‌ సెంటర్‌ వద్ద ఆయా వార్డులకు సంబంధించి ఉచిత వాహనం అందుబాటులో ఉంటుందన్నారు. 6 నుంచి 10 వార్డుల వరకు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కన, 11 నుంచి 14 వార్డులు, 20 వార్డుకు శ్రీరాములపేటలోని కాన్పులాసుపత్రి వద్ద, 15 నుంచి 19వరకు మోడంపల్లిలోని 18వ వార్డు సచివాలయం వద్ద వాహనాలను అందుబాటులో ఉంచారు.

కాగా 21 నుంచి 25 వార్డు వరకు మౌలానా ఆజాద్‌ వీధిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, 26 నుంచి 30 వరకు మున్పిపల్‌ కార్యాల యం వద్ద, 31 నుంచి 35 వార్డుల వరకు దేవాంగపేటలోని ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద, 36 నుంచి 41 వార్డులకు సంబంధించి 43వ సచివాలయం వద్ద వాహనాలను ఏర్పాటు చేశామని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Also Read:కోవిడ్ పై పోరులో మీకు సహకరిస్తాం, మీ ఆర్దర్లను అడ్డుకోకుండా చూస్తాం, సోను సూద్ కు చైనా రాయబారి హామీ

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Latest Articles