టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు డుమ్మా.. నెక్ట్స్ ఏంటీ..?
TDP Politburo Meeting: ఏపీలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. పరిషత్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి..
TDP Politburo Meeting: ఏపీలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. పరిషత్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. అశోక్ గైర్హాజరు పై భిన్న వాదనలు వస్తున్నాయి. ఎన్నికలు బహిష్కరణకు నిర్ణయం తీసుకోవడం పై అసంతృప్తి తో గైర్హాజరు అయినట్లు ఒక వర్గం వాదనలు వినిపిస్తుండగా, ఎన్నికలు బహిష్కరిస్తే పార్టీ నష్ట పోతుందనే ఆలోచన అశోక్‌గజపతిరాజు ఇప్పటికే కార్యకర్తలు వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్‌గా నీలం సాహ్నీ ఈనెల 1న బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎస్‌ఈసీతో భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికలపై చర్చించారు. కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఈ ఎన్నికల విషయమై ఎస్‌ఈసీ రాష్ట్రంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయమై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు.
Ap Zptc Mptc Election: కీలక నిర్ణయం తీసుకున్న జనసేనాని.. ఈసీ సమావేశం బహిష్కరిస్తున్నట్లు వెల్లడి