Visakhapatnam: స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 సర్వేలో విశాఖకు మూడో స్థానం
విశాఖపట్నం ప్రజలు తమ నగరాన్ని స్వచ్ఛమైనదిగా నిరూపించడానికి అవసరమైన బాధ్యతను తామే తీసుకున్నారు.
Visakhapatnam: విశాఖపట్నం ప్రజలు తమ నగరాన్ని స్వచ్ఛమైనదిగా నిరూపించడానికి అవసరమైన బాధ్యతను తామే తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లో భాగంగా నిర్వహించిన సర్వేలో విశాఖపట్నంను దేశంలోనే మూడో స్థానంలో నిలిపేవిధంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి తమ నగరాన్ని ప్రమోట్ చేసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి నగరంలోనూ మౌలికవసతులు, పరిశుభ్రత, ప్రయాణ వసతులు, పారిశుధ్య నిర్వహణ వంటి విషయాల్లో స్థానికంగా ఉండే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. దీనిలో భాగంగా నిర్వహించిన సర్వేలో విశాఖ ప్రజలు ఈ సంవత్సరం వైజాగ్ ను ఈ సంవత్సరం దేశంలోనే మూడో స్థానంలో నిలబెట్టారు. గత సంవత్సరం టాప్ 9 లో ఉన్న విశాఖపట్నం ఈసారి టాప్ 5 లో చోటు సంపాదించింది. జీవీఎంసీ అధికారులు ఈ సర్వేకు సంబంధించి ప్రజల్లో మంచి అవగాహన కల్పించడంతోనే ఇది సాధ్యమైంది.
ఈ సంవత్సరం జనవరి 1 నుంచి మార్చి 31 వరకూ విశాఖపట్నంలో ఈ సర్వే నిర్వహించారు. దీనిలో 31 శాతం మంది విశాఖ ప్రజలు పాల్గొన్నారు. దేశంలోని 100 సిటీల్లో జరిగిన ఈ సర్వేలో అత్యధికంగా ప్రజలు పాల్గొన్నది కూడా విశాఖపట్నం నుంచే కావడం గమనార్హం. దీంతో దేశంలోనే మూడో స్థానంలో విశాఖ నగరం నిలిచినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వైజాగ్ మినహా ఆంధప్రదేశ్ లోని ఇతర నగరాలు ఏవీ కూడా టాప్ 10 లో చోటు సంపాదించలేకపోయాయి.
విశాఖపట్నం నగరం ఈ స్థాయికి చేరడం పట్ల జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, అడిషనల్ కమిషనర్ , స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వి. సన్యాసిరావు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో పాలుపంచుకోవడం ద్వారా ప్రజలు ఇచ్చిన సహకారానికి ఈ సందర్భంగా వారు తమ ధన్యవాదములు తెలిపారు.
Also Read: AP Schools : ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు – విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఎస్ఈసి నీలం సాహ్ని ని కలిసిన టీడీపీ నేత వర్ల రామయ్య, కొత్త నోటిఫికేషన్ కోసం మొర