Vijayawada: 3 నెలల్లో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ పట్టా తీసుకోవాల్సిన శృతి… నురగ కక్కుతూ
ఆమె మరణం చుట్టూ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. తను ఆత్మహత్య చేసుకుందా లేదా అనారోగ్య కారణాలతో మరణించిందా..? తండ్రి చెబుతున్న ఆ క్లాస్ మేట్ ఎవరు వంటి వివరాలు పోలీసుల విచారణలో బయటకు రానున్నాయి.
విజయవాడలో మెడికో విద్యార్థిని అనుమాస్పద మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. జంగారెడ్డి గూడెం నోవా కాలేజ్‌లో ఫార్మా-డి ఫైనల్ ఇయర్ చదువుతున్న శృతి.. బుధవారం ఉదయం ఇంట్లో మంచంపై నురగ కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. పరిస్థితి విషమించడంతో ఆమె గురువారం ఉదయం మృతి చెందింది. శృతి మరణంపై కుటుంబ సభ్యుల నుంచే భిన్న వెర్షన్స్ వినిపిస్తున్నాయి. క్లాస్‌మేట్ నంటూ ఓ వ్యక్తి కాల్స్ చేసి శృతితో మాట్లాడాడని ఆమె తండ్రి చెబుతున్నాడు. ఆరోగ్యం బాగాలేకనే శృతి చనిపోయిందని బంధువులు చెబుతున్నారు. జంగారెడ్డి గూడెంలో ఇప్పటికే జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తుంది శృతి.
మూడు నెలల్లో చదువు పూర్తిచేసుకుని పట్టా తీసుకోవాల్సిన శృతి.. అనూహ్య రీతిలో విగతజీవిగా మారిపోయింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శృతి మృతికి గల స్పష్టమైన కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఆమె పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం.. కాల్ డేటా తీస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యుల నుంచే పొంతనలేని సమాధానాలు వస్తున్న నేపథ్యంలో.. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. తను ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా..? లేదా ఎవరైనా ఆ దిశగా పురిగొల్పారా.. లేదంటే.. నిజంగానే అనారోగ్య సమస్యలతో చనిపోయిందా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం