Andhra News: ఏపీలోని ఈ ప్రాంతంలో చేప‌లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త

చికెన్ వ్యర్ధాలతో చేపల సాగు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, అధికారులు ఎన్ని దాడులు చేసిన అక్రమ వ్యాపారులు తమ దందాను నయా పద్దతిలో కొనసాగిస్తూనే ఉన్నారు.

Andhra News: ఏపీలోని ఈ ప్రాంతంలో చేప‌లు కొనుగోలు చేస్తున్నారా.. అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త
Fish markets
Follow us

|

Updated on: Jun 28, 2021 | 7:36 PM

చికెన్ వ్యర్ధాలతో చేపల సాగు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, అధికారులు ఎన్ని దాడులు చేసిన అక్రమ వ్యాపారులు తమ దందాను నయా పద్దతిలో కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రాలను దాటి యధేచ్చగా చికెన్ వ్యర్ధాలు లారీల్లో చేపల చెరువులకు చేరిపోతున్నాయి… ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అధిక లాభాలే ధనార్జగా ఈ చేపల సాగును చేపడుతున్నారు. అడపా దడపా చర్యలతో అక్రమార్కుల్లో ఎటువంటి మార్పు రావడం లేదు.

వినుకొండ ప్రాంతంలో చేపలు చెరువులు అధిక సంఖ్యలో ఉన్నాయి. పంచాయితీల పరిధిలో చేపలు చెరువలు అధిక లాభాలు రావడంతో అనేక మంది ప్రవేటు భూముల్లోనూ చేపల చెరువులను సాగు చేస్తున్నారు. నూజెండ్ల మండలంతో పాటు అటు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోనూ చేపల చెరువులు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అయితే ఈ చెరువుల్లో సాధారణ రకాల చేపలతో పాటు తొందరగా చేతికొచ్చే క్యాబ్ ఫిష్, ఫంగస్ వంటి రకాల చేపలను గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తున్నారు. ప్రభుత్వం చికెన్ వ్యర్ధాల వినియోగంపై నిషేధం విధించింది. ఇందుకు గాను జీవో నంబర్ 56ను విడుదల చేసింది. మరోవైపు నాణ్యమైన ఆహారాన్ని అక్వా కల్చర్ లో అందించాలని ఇతర చట్టాలను పటిష్టం చేసింది. అయినప్పటికీ అధిక లాభాల కోసం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ , విజయవాడ వంటి పెద్ద నగరాల నుండి చికెన్ స్టాల్స్ లో కలెక్ట్ చేసిన వ్యర్ధాలను గుట్టుచప్పుడుకుండా అర్ధరాత్రుల వేళల్లో వినుకొండ ప్రాంతానికి తరలిస్తున్నారు. చికెన్ వ్యర్ధాలను ప్రాసెస్ చేసి సోయా బీన్స్ వంటి వాటితో మిక్స్ చేపల ఆహారమైన పెల్లెట్స్ ను తయారు చేసే యూనిట్‌ను అటు హైదరాబాద్ లోని చంగిజర్ల, ఇటు భీమవరంలోనూ ఉన్నాయి. అయితే ఇలా తయారు చేసిన పెల్లెట్స్ కేజీ ఇరవై రూపాయల ధర పలుకుతుంది. దీంతో అతి తక్కువ ధరకు వచ్చేలా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఒక్కో కేజీ చికెన్ వ్యర్ధాల‌కి ఎనిమిది రూపాయల ధరను చేపల చెరువులు సాగు చేసే రైతులు ఇస్తున్నారు. దీంతో సాగు ఖర్చు తగ్గిపోతుంది. మరోవైపు క్యాట్ , ఫంగస్ వంటి రకాల ధర కేజీ అరవై నుండి డెభ్భై రూపాయలు మాత్రమే పలుకుంది. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు వ్యాపారులు చికెన్ వ్యర్ధాలను నేరుగా చెరువులకు తరలిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ఆదివారం రోజు ఆరువందల టన్నుల చికెన్ వ్యర్ధాలు వస్తాయని అంచనా. దీని ప్రకారం ఒక్క రోజులోనే అర కోటి రూపాయల వ్యాపారం చికెన్ వ్యర్ధాలపై జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి వేళలో బయలు దేరిన లారీలు సోమవారం ఉదయానికి చెరువుల వద్దకు చేరుకుంటాయి. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యర్ధాలను నేరుగా చెరువుల్లోకి దొర్లించి లారీలు వెళ్లిపోతాయి. మిగతా రోజుల్లో మూడు రోజులకొకసారి ఈ వ్యర్ధాలను కలెక్ట్ చేసి చేపలకు ఆహారంగా వేస్తున్నారు. దీనిపై స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. నష్టాలు వస్తున్నాయనే పేరుతో వ్యర్ధాలను వేయడాన్ని తప్పుపడుతున్నారు. అధికారులు దాడులు చేసి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా జరగుతున్న సాగుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల కోసం ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టలేమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే దాడులు చేసి చికెన్ వ్యర్ధాలతో నిషేధిత చేపల పెంపకాన్ని అరికట్టాలన్నారు.

Also Read: తెలంగాణ‌లో కొత్తగా 993 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఇలా

ఉద్యోగ అవసరాల మీద విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా ఆరోగ్య శాఖ

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?