East Godavari: కుటుంబం అదృశ్యం విషయంలో విషాదాంతం.. మృతదేహాలు లభ్యం

తూర్పుగోదావరి జిల్లాలో కుటుంబం అదృశ్యం మిస్టరీగా మారింది. మామిడికుదురు మండలం పి.గన్నవరానికి చెందిన....

East Godavari: కుటుంబం అదృశ్యం విషయంలో విషాదాంతం..  మృతదేహాలు లభ్యం
Family Missing Mystery
Ram Naramaneni

|

Aug 01, 2021 | 4:30 PM

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన నలుగురు కుటుంబసభ్యులు చించినాడ బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన సతీష్‌, అతని భార్య సంధ్య, కుమారుడు జస్వన్ ,కుమార్తె జైశ్రీదుర్గ అదృశ్యమయ్యారు. తమ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారంటూ బంధువులు పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బైక్‌తో పాటు , పిల్లల బట్టలు జిల్లాలోని యలమంచిలి మండలం చించినాడ వంతెనపై పోలీసులు స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద పాప జై శ్రీ దుర్గ బాడీని పోలీసులు గుర్తించారు. మిగితా వారి ఆచూకి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తమ చావుకు కొంతమంది వ్యక్తులు కారణమంటూ భార్య రాసిన లేఖ వాట్సప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తోంది. దీంతోపాటు డాడీగారండీ.. నేను ఒకడి చేతిలో మోసపోయాను. నలుగురం ఇప్పుడే చనిపోతున్నాం. నేను స్పాట్‌లో ఉన్నాను. ఆ లేఖ రాసింది నేనే. జీవితం తగలబెట్టేశాడు. అది నేను ఇప్పుడే తెలుసుకున్నానంటూ ఆ వివాహిత ఆడియో సందేశం కూడా వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది. తనను రోజూ ఓ వ్యక్తి టార్చర్‌ పెట్టేవాడని, తనకు తెలియకుండానే మాత్రలు ఇచ్చేవాడని, తన డబ్బులు, బంగారం దోచుకున్నాడని లేఖలో పేర్కొంది. అది విని తన భర్త తట్టుకోలేకపోయాడని, తన కాపురం నాశనమైందని, ఇదంతా డబ్బు, బంగారం కోసమే ఆ వ్యక్తి చేశాడని రాసింది. ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉంటున్న ఆమె భర్త కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడని స్థానికులు చెబుతున్నారు.

అల్లుడితో అక్రమ సంబంధం.. భర్త హత్య

అల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. భర్తతో మద్యం తాగించి.. అల్లుడితో కలిసి అతణ్ని అతి కిరాతకంగా హతమార్చింది. అనంతరం ఓ కుంటలో పడేసి ఏం తెలియనట్లు ఇంటికి వెళ్లింది. నీటిపై తేలియాడుతున్న శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలం కంచెంవారిపల్లె సమీపంలో జరిగింది.

Also Read: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. చనిపోయిన ఒడిశా కూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

కన్న కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్.. ఎందుకో తెలిస్తే షాక్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu