Anam Ramanarayana Reddy: చేసిన తప్పే మళ్లీ చేశారా..? మాజీ మంత్రి ఆనం పొలిటికల్ డిజిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అది. జిల్లాలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా.. నిర్ణయించేంత బలమైన రాజకీయ చరిత్ర. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబంలో.. అందులోనూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. మాజీమంత్రి, సీఎం రేసులో ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారు.

Anam Ramanarayana Reddy: చేసిన తప్పే మళ్లీ చేశారా..? మాజీ మంత్రి ఆనం పొలిటికల్ డిజిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ
Anam Ramanarayana Reddy
Follow us
Ch Murali

| Edited By: Balaraju Goud

Updated on: Jan 10, 2024 | 12:45 PM

దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అది. జిల్లాలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా.. నిర్ణయించేంత బలమైన రాజకీయ చరిత్ర. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబంలో.. అందులోనూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. మాజీమంత్రి, సీఎం రేసులో ఉన్న ఆ నాయకుడు ఇప్పుడు సైలెన్స్ గా ఉన్నారు. వైసీపీకి రెబల్‌గా మారి, అంతే స్పీడ్‌గా తెలుగుదేశం పార్టీ పంచన చేరిన అతను, ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు..? ఇంతకీ ఎవరా నేత..? ఎందుకా మౌనం..? ఇది ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావన రాగానే గుర్తొచ్చే కుటుంబాలు ఆనం, నేదురుమల్లి, నల్లపురెడ్డి, మాగుంట, బెజవాడ కుటుంబాల హవా నడిచేవి అప్పట్లో. దశాబ్దం క్రితం వరకు కూడా ఆనం కుటుంబం జిల్లాలో చెప్పిందే శాసనం అన్నట్లుండేది. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి, దివంగత వివేకానంద రెడ్డి పొలిటికల్ కెరీర్ ముందుకు సాగలేదు. 2016లో టీడీపీలో చేరడం.. సరైన ప్రాధాన్యత దక్కలేదని 2019 లో వైసీపీలో చేరిన రాంనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి విజయం సాధించారు. అయితే వైసీపీలో కూడా ఆనం ఇమడలేక పోయారు. ఇక్కడ ఆనంకు తగిన గౌరవం దక్కలేదన్నదీ ఆయన వర్గం మాట. దీంతో ఆనం రెబల్ గా మారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి పార్టీ నుంచి బహిష్కరణ కు గురయ్యారు.

ఆనంకు మళ్లీ రాజకీయ పునర్జన్మ ఇచ్చింది వైసీపీ అన్నది పార్టీలో ఉన్న వారి మాట. అలాంటిది ఎలా ద్రోహం చేయగలిగారనే విమర్శలు, కౌంటర్లతో పొలిటికల్ హీట్ నడిచింది ఆమధ్య. ఇక అదే సమయంలో జిల్లాలో నారా లోకేష్ యువగళం యాత్ర ప్రవేశించింది. జిల్లాలో ఆత్మకూరులో జరిగిన తొలి సభ ఏర్పాట్లు ఆనం రాంనారాయణ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2009 లో ఆనం కాంగ్రెస్ తరపున ఆత్మకూరులో గెలిచారు. ప్రస్తుతం వెంగతగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆనం రాజకీయ అరంగేట్రం నెల్లూరు సిటి నుంచి జరిగింది. ఇక్కడి నుంచే తన రాజకీయం ముగించాలని కోరిక ఉన్నట్లు బహిరంగంగానే చెప్పారు ఆనం. అందుకే నెల్లూరు సిటి స్థానం ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నించారు.

అయితే నెల్లూరు సిటి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి నారాయణ ఇక్కడ నుంచి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం చెప్పినా అందుకు ఆనం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. వెంకటగిరి నుంచి అయిన అవకాశం ఇవ్వాలని కోరినా సానుకూలత రాలేరట. దీంతో ఆనం సర్వేపల్లి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఆనం నుంచి ఎలాంటి స్పందన లేదట. ఎక్కడా పర్యటనలు, ప్రచారాలు చేయడం లేదు. ఇంటికే పరిమితమై తన వద్దకు వచ్చే నేతలతో మాత్రమే మాట్లాడుతున్నారు. పొలిటికల్‌గా మౌనంగా ఉన్న ఆనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.

2014 ఎన్నికల తర్వాత తెలుగు దేశం పార్టీలో చేరి తప్పు చేశామని, ఆతర్వాత వైసీపీలో చేరి ఇప్పుడు మళ్లీ టీడీపీకి దగ్గరై దూరంగా ఉండడం మరో తప్పిదమేనా అన్న చర్చ జరుగుతోందట. ఆనం అడిగిన చోట అధిష్టానం అవకాశం ఇస్తుందా లేక చెప్పిన చోట పోటీ చేయాలని చెబుతుందా..? ఆనం ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనేది సస్పెన్స్ గానే ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…