AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో సంచలనం… వైసీపీ గూటికి కేశినేని నాని..?

ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. వారం రోజులుగా కేశినేని ఎపిసోడ్‌.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరికి తెలుగు దేశం పార్టీకి గుడైబై చెప్పిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్‌‌ఆర్‌సీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Kesineni Nani: ఏపీ రాజకీయాల్లో సంచలనం... వైసీపీ గూటికి కేశినేని నాని..?
Kesineni Nani
Balaraju Goud
|

Updated on: Jan 10, 2024 | 12:14 PM

Share

ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. వారం రోజులుగా కేశినేని ఎపిసోడ్‌.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరికి తెలుగు దేశం పార్టీకి గుడైబై చెప్పిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్‌‌ఆర్‌సీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇటీవల వరుస ట్వీట్‌లతో టీడీపీకి షాక్‌ మీద షాక్‌ ఇస్తున్నారు ఎంపీ కేశినేని నాని. కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా వున్న విబేధాలు… ఎన్నికల వేళ ఆధిపత్య పోరుగా మారాయి. ఈ క్రమంలోనే.. టీడీపీ అధిష్టానం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో.. కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కేశినేని నానిని పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు నాని. ఈ క్రమంలోనే వైపీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు. నాని వైసీపీలో చేరే అంశంపై ఈ రోజు సాయంత్రానికి ఓ స్పష్టత రానుంది.

తన అవసరం లేదని చంద్రబాబు భావించాక, పార్టీలో కొనసాగలేనంటూ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. మొదట ఎంపీ పదవికి, తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు. ఆ తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానన్నారు కేశినేని నాని. దీంతో కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. టీడీపీ కేశినేని నానిని పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు నాని.. ఈ క్రమంలోనే వైపీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం వైఎస్ జగన్‌ను కేశినేని నాని కలవనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే నిన్నటివరకూ చంద్రబాబు, కేశినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీలతో పసుపుమయంగా ఉన్న విజయవాడ ఎంపీ కార్యాలయం పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగించేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బెజవాడ లో నిర్మించిన మూడు ఫ్లై ఓవర్ ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నాని అభిమానులు. ఇక ఎన్ఠీఆర్ ఫోటో తో పాటు కేశినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆయన వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఆయనతో పాటు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్ కూడా వైసీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్వామి దాస్ ను విజయవాడలో అందుబాటులో ఉండాలని ఎంపీ నాని చెప్నినట్లు పార్టీలు చెబుతున్నాయి.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…