Andhra pradesh: రుతుపవనాలు వచ్చినా.. ఉక్కపోత తప్పట్లేదు. ఏపీలో కొనసాగుతోన్న వడగాల్పులు.

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి, వాతావరణం కూల్‌గా మారుతుందని ఆశించిన ప్రజలకు ఇంకా వడగాల్పులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఉక్కపోత తప్పడం లేదు. సోమవారం రాష్ట్రంలో...

Andhra pradesh: రుతుపవనాలు వచ్చినా.. ఉక్కపోత తప్పట్లేదు. ఏపీలో కొనసాగుతోన్న వడగాల్పులు.
Heat Wave
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 12, 2023 | 7:59 AM

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి, వాతావరణం కూల్‌గా మారుతుందని ఆశించిన ప్రజలకు ఇంకా వడగాల్పులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఉక్కపోత తప్పడం లేదు. సోమవారం రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 220 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అనకాపల్లి, కాకినాడ, కడప, విజయనగరం జిల్లాలో 44.8°C ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా, కోనసీమ జిల్లాలో 44.1°C ఉష్ణోగ్రత రికార్డ అయ్యింది. అయితే రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టవని అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడానికి మరో రెండు రోజులు సమయం పడుతుందని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరో రెండు రోజులు ఎండలు తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమంత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే ఎండ తీవ్రత ఉన్నా మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షం పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. పొలాల్లో పనిచేసే కూలీలు, పుశు-గొర్రె కాపరులు చెట్ల కింద ఉండకూదని అధికారులు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..