Anantapur: బతుకు పోరాటంలో అలసిపోయి..అనంతపురం జిల్లాలో నలుగురి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు

అనంతపురం జిల్లా గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం జిల్లాలో కలకలం కలిగిస్తోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా.. ఓ నిరుద్యోగి మాత్రం ఉద్యోగ వేటలో ఓడిపోయి..

Anantapur: బతుకు పోరాటంలో అలసిపోయి..అనంతపురం జిల్లాలో నలుగురి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు
Suicide
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 8:00 AM

అనంతపురం జిల్లా గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం జిల్లాలో కలకలం కలిగిస్తోంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడగా.. ఓ నిరుద్యోగి మాత్రం ఉద్యోగ వేటలో ఓడిపోయి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్న వారు మోసం చేశారని..ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను తీవ్ర విషాదాలలోకి నెట్టివేస్తున్నాయి . కుటుంబ కలహాలతో, ఆర్థిక ఇబ్బందులతో ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో భాద.. కారణం ఏదైనా ఆత్మహత్యలే పరిష్కారంగా భావించి ఏకంగా నలుగురు వ్యక్తులు ఒకేరోజు ఆత్మహత్యకు పాల్పడడం అనంతపురం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ..గుత్తి మండల పరిధిలోని ఊటకల్లు గ్రామంలో రైతు వడ్ల ఆచారి పొలంలోనే క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందాడు. ఆచారికి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కలిసి రాక అప్పులు అవ్వడం… దీనికి తోడు కుటుంబ కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో గుత్తి మండలం వన్నె దొడ్డి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే ఎంబీఏ పూర్తి చేసుకున్న విద్యార్థి ఉద్యోగ వేటలో అనంతపురానికి చెందిన వ్యక్తులను నమ్మి మోసపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు..రిజిస్టర్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో అతని మిత్రుడుతో కలసి నాలుగు లక్షల అరవై వేలు ఇచ్చారు. 8 నెలలు గడుస్తున్న ఏ ఉద్యోగము ఇప్పించకపోవడంతో వారి వద్దకు తిరిగి విసిగిపోయి తన డబ్బులు తనకు ఇవ్వాలని నిలదీసాడు.వారు స్పందించకపోగా డబ్బులు లేవు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాసులు (24) తెల్లవారుజామునే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక గుంతకల్లు పట్టణ పరిధిలోని భాగ్యనగర్ లో గిరీష్(26) అనే యువకుడు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ మూడు ఘటనలు గుంతకల్లు నియోజకవర్గం లో చోటు చేసుకోగా… ఉరవకొండ నియోజకవర్గంలో అనిల్ అనే పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ కు వివాహం అయ్యింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇలా చిన్న చిన్న సమస్యలకు స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య పాల్పడడంతో ముగ్గురు పిల్లలు, భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నారు .కష్టాలు ఏవైనా.. కారణాలు వేరైనా ఇలా ఆత్మహత్యలే శరణ్యం అనుకుని ఆత్మహత్యలకు పాల్పడటంతో నాలుగు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..