AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఔరా.. అంకుడు కర్రతో అద్భుత సృష్టి.. చూపు తిప్పుకోలేనంతగా ఆ కళాఖండాలు..!

ఆయనో కళాకారుడు.. అంకుడ కర్రతో కళారూపాలు తయారు చేయడం హాబి..! కానీ స్వాతంత్ర దినోత్సవం వేళ ఈ కళాకారుడు తమదైన శైలిలో దేశభక్తి చాటుకున్నాడు. అంకుడు కర్రతో అద్భుత కళారూపాలను తయారు చేశాడు. సహజ సిద్ధ రంగుల మేళవింపుతో దేశ సమైక్యతను చాటుకునేలా జాతీయ పతాకం, యుద్ధ విమానాలు, మిసైల్స్, శాంతికపోతాల నమూనాలు రూపొందించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు.

Andhra: ఔరా.. అంకుడు కర్రతో అద్భుత సృష్టి.. చూపు తిప్పుకోలేనంతగా ఆ కళాఖండాలు..!
Handicrafts
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Aug 15, 2025 | 9:16 PM

Share

అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక అనగానే హస్త కళాకారులకు ప్రసిద్ధి. అంకుడు కర్రతో వివిధ రకాల కళారూపాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడి బొమ్మలు దేశ విదేశాల్లో ప్రాచూర్యం పొందాయి. మోడీ మనసును సైతం మెప్పించాయి. అయితే.. ఓ కళాకారుడు స్వతంత్ర దినోత్సవం వేళ తన ప్రతిభకు పదును పెట్టాడు. అంకుడు కర్ర సహాయంతో సహజ సిద్ధ రంగుల మేళవింపుతో దేశ సమైక్యతను చాటుకునేలా జాతీయ పతాకమును, ప్రతిష్టాత్మక యుద్ధ విమానాలను రూపొందించాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ జాతీయ పతాకాన్ని యుద్ధ విమానాలను రూపొందించానని అంటున్నాడు హస్త కళాకారుడు గుత్తి వాసు.

బీఈడీ వరకు చదువుకున్న వాసు.. చిన్నతనం నుంచే హస్తకళావృత్తి పైనే జీవించే తన తండ్రి సూరిబాబు వద్ద కళారూపాల తయారీ ని నేర్చుకున్నాడు. చదువుతోపాటు హస్తకళలు తయారు చేయడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నాడు.

అయితే.. ఈ అలా రూపాలను తయారు చేసేందుకు వారం రోజులపాటు శ్రమించాడు. జాతీయ పతాకాన్ని తయారు చేయడంతో పాటు శాంతిక చిహ్నంగా నిలిచేలా రెండు పావురాలను ఏర్పాటు చేసి జాతీయ పతాకాన్ని రూపొందించాడు. అలాగే రాఫెల్ యుద్ధ విమానం, క్షిపణి అందంగా తీర్చిదిద్దాడు. అంకుడు కర్ర ఉపయోగించి రూపొందించిన ఈ హస్త కళాఖండాలను అవకాశం ఉంటే ప్రధాని దృష్టికి తీసుకెళ్తానంటున్నాడు.

Vasu

Vasu