Watch: పులివెందులలో వైసీపీ ఓటమిపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Pulivendula ZPTC Result: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏజెంట్లను సైతం కనీసం పోలింగ్ కేంద్రాల్లోకి రానివ్వకుండా ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్య పద్దతిలో పోలింగ్ జరగలేదని ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఏజెంట్లను కనీసం పోలింగ్ బూత్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. మహిళలు క్యూలైన్‌లలో లేకుండా పోలింగ్ జరిగిందని అభ్యంతరం చెప్పారు. బయటినుంచి వచ్చినవారు దొంగ ఓట్లు వేసి వెళ్లారని ఆరోపించారు. పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతోందన్నారు.
వైరల్ వీడియోలు
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

