Watch: తెలంగాణ కాంగ్రెస్‌లోనూ బీజేపీ కోవర్టులు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గా రెడ్డి చేసిన కామెంట్స్ ఆ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తమ పార్టీలోనూ కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినుద్దేశించే ఆయన ఈ పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీలోనూ ఒకరు, ఇద్దరు కోవర్టులు ఉంటారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీ కోవర్టులు ఉన్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ ఇస్తామంటే స్క్రిప్ట్ చదువుతూ ఉంటారని ఆరోపించారు. రాజకీయాల్లో కోవర్ట్ వ్యూహం ఎప్పటి నుంచో ఉందన్నారు జగ్గారెడ్డి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే జగ్గా రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేలా ఎమ్మెల్యే కోమటిరెడ్డి గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తుండటం తెలిసిందే.
Published on: Aug 15, 2025 08:19 PM
వైరల్ వీడియోలు
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

