Andhra Pradesh: నీకెంత.. నాకెంత..? క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లతో ‘ఖాకీ’ల డీల్.. ఏపీలో సంచలనంగా మారిన లీక్స్..
ఖద్దరు.. రాజకీయ నేతను ఎలా విడదీయలేమో నేరస్తుడిని ఖాకినీ వేరు చేయలేం.. వ్రృత్తి ధర్మంగా నేరస్తుల్ని పట్టుకునే క్రమంలో.. పోలీసులకు వారితో పరిచయాలు పెరుగుతాయి. అయితే, కొందరు ఖాకీలు వాళ్లతో చెట్టా పట్టాలేసుకుని తిరగటం వివాదాస్పందంగా మారుతుంది. గతంలో ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఘటనలో అప్పటి యస్.ఐ వి.ఆర్ కి వెళ్లారు. ఇక తాజాగా అదే స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు తో పోలీసుల నగదు లావాదేవీలు బయటకు రావటం సంచలనంగా మారింది.

ఏలూరు, అక్టోబర్ 21: ఖద్దరు.. రాజకీయ నేతను ఎలా విడదీయలేమో నేరస్తుడిని ఖాకినీ వేరు చేయలేం.. వ్రృత్తి ధర్మంగా నేరస్తుల్ని పట్టుకునే క్రమంలో.. పోలీసులకు వారితో పరిచయాలు పెరుగుతాయి. అయితే, కొందరు ఖాకీలు వాళ్లతో చెట్టా పట్టాలేసుకుని తిరగటం వివాదాస్పందంగా మారుతుంది. గతంలో ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఘటనలో అప్పటి యస్.ఐ వి.ఆర్ కి వెళ్లారు. ఇక తాజాగా అదే స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు తో పోలీసుల నగదు లావాదేవీలు బయటకు రావటం సంచలనంగా మారింది. ఏలూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని.. టూ టౌన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. గానుగులపేట ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్‌లో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న నారాయణపు శ్రీనివాస్ అలియాస్ వాసు ఇంటిపై దాడి చేసి రూ.30,800ల నగదు, 6 సెల్ ఫోన్లు, లాప్ టాప్, టీవీ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో సెల్ ఫోన్‌ను పోలీసులు పరిశీలించటంతో అందులో భీమవరపు సురేష్ అనే వ్యక్తి పాత్ర ఉందనే విషయాన్ని పోలీసులు ధ్రృవీకరించుకున్నారు. అతనిపై చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేస్తుండగా భీమవరపు సురేష్ కొన్ని ఆధారాలను ఉన్నతాధికారులకు పంపాడు. టూ టౌన్ కానిస్టేబుల్ సీతయ్య అతనితో నగదు లావాదేవీలకు సంబంధించి జరిపిన సంభాషణలు, ట్రాన్జాక్షన్ స్క్రిన్ షాట్స్, తన ఇంటికి వచ్చిన పోలీసులు సి.సి కెమెరా ఫుటేజ్ వివరాలు బహిర్గతం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఏలూరు పోలీసుల పరిస్థితి రివర్స్ అయింది. ఇవన్నీ వెలుగులోకి రాగానే కానిస్టేబుల్ సీతయ్యను ఎస్పీ మేరీ ప్రశాంతి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆడియోలో కొందరు అధికారుల పేర్లను ప్రస్తావించటంతో వారి బ్యాంకు లావాదేవీలపైనా అధికారులు విచారిస్తున్నారు.
సంచలనంగా కానిస్టేబుల్ వ్యవహారం..
మరోవైపు పరమేశ్వరుడికి మరోపేరు పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ వ్యవహారం ఇటీవల ఎస్పీ కార్యాలయంలో చర్చనీయాంశంగా మరింది. దీర్ఘకాలంగా అక్కడే పని చేసే అతడు ఏలూరుకు చెందిన బిల్డర్‌తో లావాదేవీలు జరిపాడు. ఇన్‌కంటాక్స్ కోసమంటూ బ్యాంక్ లోనుపై బిల్డర్ నుంచి ప్లాట్ కొనుగోలు చేశాడు. బిల్డర్‌కు పూర్తి డబ్బు చెల్లించకుండా సుమారు రూ.10 లక్షలు వెనక్కు తీసుకున్నాడు. మొత్తం బ్యాంక్ లోను ప్రస్తుతం బిల్డర్ కడుతుండగా, మంజూరైన లోన్ అమౌంట్లో కొంత డబ్బు బిల్డర్ దగ్గరే ఉంది కాబట్టి దానికి ఎదురు వడ్డీ కట్టమని కానిస్టేబుల్ బెదిరింపులకు దిగాడు.
దీంతో ఉత్తి పుణ్యానికి ఆస్తి రాయించుకోవటంతో పాటు కానిస్టేబుల్ ఎదురు డబ్బులు డిమాండ్ చేయటంతో మొత్తం బ్యాంక్ ట్రాన్జాక్షన్స్, వాట్సాప్ చాటింగ్‌లు, ఫోన్ సంభాషణలు అన్నీ పోలీసు ఉన్నతాధికారులు అందచేశాడు బాధిత బిల్డర్.. దీంతో ఎస్పీ కార్యాలయం నుంచి అతడిని ఏజెన్సీలోని ఓ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు అధికారులు.. దీంతో తన పలుకుబడి ఉపయోగించి బిల్డర్‌ను స్టేషన్‌కు పిలిపిస్తుండటంతో బాధితుడు ఉన్నతాధికారుల సలహా మేరకు లీగల్‌గా ముందుకు వెలుతున్నట్లు సమాచారం..
ఏలూరులో హాట్ టాపిక్..
నిస్సిగ్గుగా అనధికార లావాదేవీలు చేయటం, అవినీతికి పాల్పడి తరుచుగా ఖాకీలు దొరికి పోతుండటం ప్రస్తుతం ఏలూరులో చర్చ నీయాంశంగా మారింది. ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ఉన్నతాధికారులపై వత్తిడి తీసుకువచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. దీంతో ఖాకీలపై ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుని తులసి వనంలో ఉన్న గంజాయి మొక్కలను ఏరి పారేయాల్సిన అవసరం ఉందని ప్రజలు బహిరంగంగా పేర్కొంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
