మందేసి చిందేసిన అధికారులు…

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ అధికారుల మందుపార్టీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని ఆళ్లగడ్డ విద్యుత్‌ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్‌ కాంట్రాక్టర్లు ఫుల్టుగా మద్యం సేవించి డ్యాన్సులతో ఇరగదీశారు. ఆళ్లగడ్డ డివిజన్‌ డీఈఈ ట్రాన్స్‌ఫర్‌ అయిన సందర్భంగా డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది కలిసి రుద్రవరం సమీపంలోని గుట్టకొండ నరసింహ స్వామి సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద విందు ఏర్పాటు […]

మందేసి చిందేసిన అధికారులు...
Follow us
Anil kumar poka

|

Updated on: Nov 19, 2019 | 7:17 AM

కర్నూలు జిల్లాలో విద్యుత్‌ అధికారుల మందుపార్టీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లాలోని ఆళ్లగడ్డ విద్యుత్‌ అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. నల్లమల ఫారెస్టులో అధికారులు, విద్యుత్‌ కాంట్రాక్టర్లు ఫుల్టుగా మద్యం సేవించి డ్యాన్సులతో ఇరగదీశారు. ఆళ్లగడ్డ డివిజన్‌ డీఈఈ ట్రాన్స్‌ఫర్‌ అయిన సందర్భంగా డివిజన్‌ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన అధికారులు, కాంట్రాక్టు సిబ్బంది కలిసి రుద్రవరం సమీపంలోని గుట్టకొండ నరసింహ స్వామి సమీపంలోని తెలుగు గంగ కాల్వ వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అయితే, డ్యూటీ టైమ్‌లోనే అధికారులు మందు పార్టీ చేసుకున్నారని ఆరోపిస్తూ..కొందరు ఆ వీడియోను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో షేర్‌ చేశారు. దీంతో ఆ దృశ్యాలు ఇప్పుడు జిల్లాలోనే సంచలనంగా మారాయి. దీంతో సీరియస్‌ అయిన అధికార యంత్రాంగం దీనిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఎవరైతే డ్యూటీ సమయంలో ఫారెస్టులోకి వెళ్లి మద్యం తాగి, చిందేశారో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.