80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉండాలంటే..మనం తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే..యోగా, […]

80 ఏళ్ల యోగా బామ్మ..ఆసనాలు చూస్తే..అవాక్కే !
Follow us

|

Updated on: Nov 19, 2019 | 7:12 AM

గత దశాబ్ధ కాలంగా  మన జీవన శైలిలో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పెరిగిన జీవన వేగంతో పాటు కాలుష్యం కారణంగా ..లెక్కకు మించిన అంతుబట్టని అనారోగ్యాలతో సగటు మనిషి సతమతమవుతున్నాడు. ఆదాయాలు పెరిగినంతగా మనిషి జీవన ప్రమాణాలు పెరగటం లేదు. లెక్కకు మించిన వైద్య విధానాలు ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించటం లేదు. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ ఉండాలంటే..మనం తినే తిండి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిట్‌నెస్‌గా ఉండాలంటే..యోగా, జిమ్‌, వాకింగ్‌ లాంటివి చేస్తుంటారు. అయితే, ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉండాలంటే..యోగా ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. మనసు ఉల్లాసంగా ఉండాలే గానీ, వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ప్రశాంతతను కోరుకుంటారు. దానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది యోగా. తాజాగా 85 ఏళ్ల ఓ బామ్మ తన యోగాసనాలతో వావ్‌ అనిపిస్తోంది.

ఆమెకు ఆస్పత్రి అంటే తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ అవసరం రాలేదు కాబట్టి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలో నివసిస్తున్న జిగురు కనకలక్ష్మికి 85 ఏళ్లు. ఇప్పటివరకు ఆమెకు చిన్న జ్వరం కూడా రాలేదట. కనకలక్ష్మికి ఐదుగురు సంతానం. నలుగురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అయితే, ఎనిమిది పదుల వయసు దాటినప్పటికీ తన శరీరాన్ని హరివిల్లుల వంచేస్తూ కఠినమైన యోగాసనాలను అవలీలగా వేస్తుంది. తన ఆరోగ్య రహస్యం..ప్రతినిత్యమూ వ్యాయామము, యోగా అని గర్వంగా చెబుతుంది. మనిషి జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయని, శ్రమపడితేనే రోగాలు దరిచేరవని అంటున్న బామ్మ..గత 20 ఏళ్ల క్రితమే మాంసాహారాన్ని పూర్తిగా వదిలేసి, కేవలం శాఖాహారం భోజనంతోనే జీవిస్తున్నానని చెబుతుంది. ఏదేమైనప్పటికీ క్రమం తప్పకుండా యోగా చేస్తానని, ఒక్కరోజు యోగా చేయకపోతే..శరీరం లేజీగా తయారవుతుందని అంటోంది. తన పనులన్నీ తానే చేసుకుంటూ..అద్భుతమైన యోగాసనాలు వేస్తున్న కనకలక్ష్మిని చూసి గ్రామస్తులు సైతం నివ్వెర పోతున్నారు. నేటి తరం యువత ఈ బామ్మను ఆదర్శంగా తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని స్థానికులు సూచిస్తున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.