Andra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది.. రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఓటర్లున్నారంటే..
Andra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ఏపీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Andra Pradesh Voters: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ఏపీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. ఇక వీరిలో పురుష ఓటర్లు 1,99,66,737 ఉండగా.. 2,04,71,506 మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135 ఉన్నారు. ఇక సర్వీసు ఓటర్లు 66,844 మంది ఉన్నారు. కాగా, 2021 జనవరి 15 నాటికి రాష్ట్రంలో కొత్తగా 4,25,860 మంది ఓటర్లు కొత్తగా ఓటు హక్కును పొందారని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రగడ నడస్తోన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిషికేషన్ విడుదల చేయగా.. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాల్సి ఉన్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని కోర్టుకు ప్రభుత్వం వివరించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం.. హైకోర్టును కోరింది. అయితే ప్రభుత్వ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఎన్నికల నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది.
Also read:
నరసరావుపేట గోపూజ మహోత్సవంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్.జగన్ మోహన్ రెడ్డి.