Temples Security: ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు కీలకం: మీడియాతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్
Temples Security: ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు ఎంతో కీలకమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి...
Temples Security: ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు ఎంతో కీలకమని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై వరుస దాడులకు సంబంధించి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు భద్రతతో పాటు టెంపుల్ కమిటీలు, మతసామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయని అన్నారు. 9 కేసుల్లో పలువురు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామని అన్నారు. అరెస్టు అయిన వారిలో టీడీపీకి చెందిన 13మంది, బీజేపీకి చెందిన ఇద్దరు ఉన్నట్లు చెప్పారు.
పథకం ప్రకారమే అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే 13,296 ఆలయాల దగ్గర సెప్టెంబర్‌కు ముందు 44,521 సీసీ కెమెరాలు ఉన్నాయని, సెప్టెంబర్ తర్వాత 31,216 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు.