Pawan Kalyan: 21న తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. పాల్గొననున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 21న సాయంత్రం...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 21న సాయంత్రం నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ పాల్గొంటారు. ఈ సమావేశంలో పవన్‌తో పాటు రాజకీయ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.