AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 94 పాజిటివ్..

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..
Shiva Prajapati
|

Updated on: Jan 15, 2021 | 4:05 PM

Share

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 94 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మొత్తం 31, 696 శాంపిల్స్ సేకరించగా.. 19 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఇక కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. ఆ మేరకు శుక్రవారం నాడు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ కరోనా బులెటిన్‌ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 232 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. కాగా, తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 8,85,710కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,199 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,76,372 మంది కరోనాను జయించగా.. 7,139 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 94 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 15 కేసులు నమోదు అయ్యయి. ఆ తరువాత గుంటూరు 14, వైఎస్ఆర్ కపడ 13, కృష్ణా 12, విశాఖపట్నం 12, చిత్తూరు 10 చొప్పున కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇదిలాఉంటే.. మరికొద్ది గంటల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం విశేషం అని చెప్పాలి.

Also read:

Anna Hazare writes to PM Narendra Modi : ఇదే నా చివరి దీక్ష.. ప్రధాని మోదీకి లేఖ రాసిన అన్నా హజారే..

తిరుమలలో వైభవంగా గోదాదేవి పరిణయోత్సవం, మూలవిరాట్టుకు గోదామాలలు అలంకరించిన అపూర్వ ఘట్టం