Anna Hazare writes to PM Narendra Modi : ఇదే నా చివరి దీక్ష.. ప్రధాని మోదీకి లేఖ రాసిన అన్నా హజారే..

ఇది తన జీవితంలో చిట్ట చివరి నిరాహార దీక్ష అని లేఖలో అన్నా హజారే రాసుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు..

Anna Hazare writes to PM Narendra Modi : ఇదే నా చివరి దీక్ష.. ప్రధాని మోదీకి లేఖ రాసిన అన్నా హజారే..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 3:37 PM

Anna Hazare Writes to PM Modi : రైతుల కోసం చేసే నిరాహార దీక్షనే తన జీవితంలో చివరి ఉద్యమం అంటూ ప్రకటించారు సామాజిక కార్యకర్త అన్నా హజారే. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపడతానని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఓ లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. చట్టాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఇది తన జీవితంలో చిట్ట చివరి నిరాహార దీక్ష అని లేఖలో అన్నా హజారే రాసుకొచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రామ్​లీలా మైదానంలో జనవరి చివరివారంలో దీక్ష ఉంటుందని ప్రకటించారు.

అయితే డిసెంబర్​ 14 కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్​ తోమార్​కు లేఖ రాశానన్నారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోయినా, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేయకపోయినా నిరాహార దీక్ష చేపడతానని ఇది వరకే తాను లేఖలో తెలిపినట్లు మీడియాకు వివరించారు అన్నా హజారే. అగ్రికల్చరల్​ కాస్ట్​ అండ్ ప్రైసెస్ కమిషన్​కు స్వయంప్రతిపత్తి కల్పించాలని.. తాను లేఖలో డిమాండ్​ చేసినట్లు తెలిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

దిల్లీ రామ్​లీలా మైదానంలో నిరాహార దీక్ష అనుమతికోసం అధికారులకు ఇప్పటికే నాలుగు లేఖలు రాశానన్నారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.