Covid Vaccine: తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. ఆ రెండు కేంద్రాల్లోని లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ ఇంటరాక్ట్..

Covid Vaccine: కరోనా మహమ్మారి పీచమణిచేందుకు వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ..

Covid Vaccine: తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. ఆ రెండు కేంద్రాల్లోని లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ ఇంటరాక్ట్..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:38 PM

Covid Vaccine: కరోనా మహమ్మారి పీచమణిచేందుకు వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తుండగా.. దేశ వ్యాప్తంగా అయితే ప్రధాని నరేంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. వ్యాక్సినేషన్ కోసం తెలంగాణ వ్యాప్తంగా అధికారులు 139 కేంద్రాలను సిద్ధం చేయగా.. గాంధీ ఆస్పత్రి, నార్సింగి కేంద్రాల్లో వ్యాక్సిన్ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ఇంటరాక్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. మిగిలిన 137 కేంద్రాల్లో లబ్ధిదారులు మోదీ స్పీచ్ వినేలా ఏర్పాట్లు చేశారు.

ఇదిలాఉంటే.. రేపటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలవుతుండటంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇదే అంశమై శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర హెల్డ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి 3.84 లక్షల డోస్‌లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో రేపటి వ్యాక్సినేషన్ కోసం139 కేంద్రాలను సిద్ధం చేశామని ఆయన చెప్పారు. ప్రతి కేద్రంలో 30 మంది చొప్పున 4170 మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దశల వారీగా వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచడంతో పాటు.. లబ్ధిదారుల సంఖ్యనూ పెంచుతామన్నారు. ప్రస్తుతానికి 30 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించగా.. సోమవారం నుంచి 50 మందికి చొప్పున వ్యాక్సినేష్ ఇస్తామన్నారు. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తొలి రోజు.. సఫాయి కార్మికులకు టీకా వేస్తామన్నారు. వారి లేని చోట హెల్త్ వర్కర్లు టీకా ఇవ్వడం జరుగుతుందని రమేష్ రెడ్డి  తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.30 లక్షల హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను కూడా గాంధీ ఆస్పత్రిలో వ్యాక్సి్న్ వేయించుకుంటున్నట్లు హెల్డ్ డైరెక్టర్ తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు ప్రభుత్వ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దశల వారీగా ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.

ఇదిలాఉంటే.. 0.5 ఎంఎల్ చొప్పున వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని హెల్త్ డైరెక్టర్ రమేష్ రెడ్డి వివరించారు. 2 నుంచి 7 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్య వ్యాక్సిన్‌ను భద్రపరిచినట్లు చెప్పారు. 139 కేంద్రాల దగ్గర ఒక్కో అంబులెన్స్‌ అంబులెన్స్ అందుబాటులో ఉంటుందన్నారు. అలాగే వ్యాక్సిన్ కేంద్రాల వద్ద సీనియర్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారని చెప్పారు. ఒకవేళ టీకా వికటించి ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవస వైద్యం అందించేందుకు 57 ఆస్పత్రులను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 570 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రతి వ్యాక్సినే కేంద్రంలో రియాక్షన్ కంట్రోల్ మెడిసిన్‌ను కూడా అందుబాటులో ఉంచామన్నారు.

Also read:

Turkey Drought: నీటి కరువుతో 45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం.. త్వరలో బంగారం కంటే నీరు విలువైంది కానుందా ..!

Corona Tests: కరోనా పరీక్షల పేరుతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అడ్డగోలు దోపిడీ.. ప్రయాణికుల నుంచి భారీగా వసూలు