ED Raids: ఏపీలో ఈడీ సోదాల కలకలం.. ఢిల్లీ నుంచి వచ్చిన 4 టీమ్స్.. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో పాటు..

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు.. పరస్పర ఫిర్యాదులు నుంచి ఇప్పుడు ఈడీ దాడుల దాకా వెళ్లింది..

ED Raids: ఏపీలో ఈడీ సోదాల కలకలం.. ఢిల్లీ నుంచి వచ్చిన 4 టీమ్స్.. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో పాటు..
Ed Raids
Follow us

|

Updated on: Dec 02, 2022 | 4:43 PM

వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన గుంటూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు.. పరస్పర ఫిర్యాదులు నుంచి ఇప్పుడు ఈడీ దాడుల దాకా వెళ్లింది మ్యాటర్‌. ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు ప్రత్యేక బృందాలు కేంద్ర బలగాల బందోబస్తు మధ్య ఆస్పత్రిలో రికార్డుల్ని పరిశీలిస్తున్నాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని పాయింట్‌ టు పాయింట్‌ ఆరాతీస్తున్నాయి. ఎన్‌ఆర్‌ఐ సొసైటి సభ్యురాలు అక్కినేని మణి టార్గెట్‌గా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. విదేశీ నిధులు సొంత ఖాతాలకు మళ్లింపు, కరోనా సమయంలో పేషెంట్ల నుంచి ఇష్టారాజ్యంగా వసూళ్లు, ఎన్‌ఆర్‌ఐ నిధులతో విజయవాడ అక్కినేని ఉమెన్స్‌ ఆస్పత్రికి వైద్య పరికరాలు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఈడీ వీటిపైనే దృష్టి సారించింది ఈడీ. మణిని వేర్వేరు కోణాల్లో ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ముందస్తు సమాచారంతో నిమ్మగడ్డ ఉపేంద్ర పరార్‌..

గతంలో ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి సంబంధించి అవినీతి ఆరోపణలపై అక్కినేని మణి, నిమ్మగడ్డ ఉపేంద్రలు అరెస్ట్‌ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ల ఇళ్లల్లోనే ఈడీ దాడులు చేస్తోంది. సోదాల సమాచారం అందగానే నిమ్మగడ్డ ఉపేంద్ర పరారయ్యాడు. దీంతో ఆయన ఇంటిని సీజ్ చేశారు అధికారులు. అక్కినేని మణితో పాటు సొసైటీ సభ్యులు నళిని మోహన్‌, ఉప్పాల శ్రీనివాసరావుల ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు.

కో అంటే కోట్ల రూపాయలు అనేలా.. NRI ఆస్పత్రికి చెందిన విదేశీ నిధులొచ్చాయి. వాటిని ఆస్పత్రి అవసరాలకు వాడకుండా.. అక్కినేని మణి సొంత ఆస్పత్రికి మళ్లించారని తెలుస్తోంది. ఈ వివరాలను రాబట్టే పనిలో పడింది ఈడీ.  అలాగే ఈడీ సోదాలు జరిపే సమయంలో ఆస్పత్రిలోని సిబ్బంది ఫోన్‌లను సైతం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డిపార్ట్‌మెంట్‌ నుంచి సోదాలలో 8 మంది పాల్గొన్నారు. ఆస్పత్రి లోపలికి ఎవరు వెళ్లకుండా సీఆర్పీఎఫ్‌తో బందోస్తు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి