AP Weather: ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన

ఇప్ప‌టికే ఏపీలో రికార్డు రేంజ్‌లో వర్షపాతం నమోదయ్యింది. భూగర్భ జలాలు కూడా పెరిగాయి. తాజాగా రాష్ట్రానికి మరో అల్పపీడన ముప్పు ఉందని తెలిపింది వెదర్ డిపార్ట్‌మెంట్.

AP Weather: ఏపీకి మరో ముప్పు.. ముంచుకొస్తున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాలకు వర్ష సూచన
Andhra Weather Report
Follow us

|

Updated on: Dec 02, 2022 | 1:52 PM

ఆంధ్రప్రదేశ్‌కు రెయిన్ అలెర్ట్ వచ్చేసింది. మరోసారి వానలు కుమ్మేయనున్నాయి. 4 డిసెంబర్ 2022 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలోకి తుపాను ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో 5వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం & దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.  ఇది డిసెంబర్ 7 ఉదయం నాటికి పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ డిసెంబర్ 8 ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక  దిగువ ట్రోపోస్పిరిక్ నార్త్ ఈస్టర్ / ఈస్టర్ గాలులు ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా ఉన్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇంకొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో వరి, పత్తి, మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

ఈ రోజు, రేపు, ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వానలు పలు ప్రాంతాల్లో చోట్ల కురిసే చాన్స్ ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈ రోజు :- చెదురుమదురు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే చాన్స్ ఉంది

ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి. మెరుపులతో కూడిన ఉరుములు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :-

ఈ రోజు:  వెదర్ పొడిగా ఉండే చాన్సస్ ఉన్నాయి. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో జల్లులు పడొచ్చు

రేపు:- చెదురుమదురు జల్లలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది

ఎల్లుండి:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే చాన్స్ ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే సూచనలు ఉన్నాయి

మరిన్న ఏపీ న్యూస్ కోసం

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన