AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: బ్రాండింగ్ కోసం నయా ఐడియా.. ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్..

వ్యాపారం ప్రారంభించి రెండు నెలలైనా అనుకున్న స్థాయిలో మార్కెట్లోకి వెళ్లలేదని భావించి ఒక కొత్త తరహా ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశాడు..అదే ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్..కేవలం ఒక ఐదు పైసలు నాణెం మీ దగ్గరుంటే చాలు..

Business Idea: బ్రాండింగ్ కోసం నయా ఐడియా.. ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్.. హిట్ కొట్టిన బిజినెస్ మ్యాన్..
Delicious Thali At 5 Paisa
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2022 | 2:37 PM

అందరికీ బుర్ర ఉంటది కానీ వ్యాపారం చేసే తెలివి తేటలు కొంతమందికే సొంతం.. చిన్నదైనా పెద్దదైన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే.. పదిమందిని ఆకట్టుకోవాలంటే.. ప్రజలను ఆకట్టుకునే తెలివి తేటలు ఉండాలని చెప్పక తప్పదు.. ఈ నేపథ్యంలో కొత్త తరహాలో ఆలోచించి క్రియేటివిగా కొందరు ఐడియాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. విజయవాడ మహా నగరంలో భారీగా పెట్టుబడి పెట్టి మంచి హోటల్ని నెలకొల్పిన నిర్వాహకుడు 5 పైసలు ఐడియాతో అందరిని ఆ హోటల్ కి క్యూ కట్టేలా చేశాడు.

వ్యాపారం ప్రారంభించి రెండు నెలలైనా అనుకున్న స్థాయిలో మార్కెట్లోకి వెళ్లలేదని భావించి ఒక కొత్త తరహా ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశాడు..అదే ఐదు పైసలకే ఫుల్ స్టార్ మీల్స్..కేవలం ఒక ఐదు పైసలు నాణెం మీ దగ్గరుంటే చాలు… కడుపునిండా స్టార్ విందు ఆరగించవచ్చు అనే టైటిల్ తో ప్రచారం చేసి హిట్ కొట్టాడు.

విజయవాడ పట్టణంలోని మొగల్రాజపురంలోని ఓ హోటల్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కి ఐదు పైసల నాణేలు ఎక్కడి నుంచి తెచ్చారో గానీ, భోజనప్రియులు భారీగా వచ్చేశారు. ఏకంగా రోడ్డు మీదకు క్యూ కట్టారు. దారంట వెళ్లేవారు క్యూను చూసి ఆగి, ఆ వివరాలు తెలుసుకుని ఇళ్లకు పరిగెత్తారు. పాత వస్తువులన్నీ తిరగేసి ఐదు పైసల నాణేలన్నీ వెతికి మరీ పట్టుకున్నారు. కానీ కండిషన్స్ అప్లై చేసాడు ఐదు పైసలు తెచ్చిన మొదటి 50 మందికి మాత్రమే ఉచితంగా పసందైన భోజనం పెట్టాడు ఆ తర్వాత వచ్చిన వారికి 50 శాతం డిస్కౌంట్ ఇచ్చాడు. ఈ స్టార్ భోజనం ఖరీదు 418రూ… ఈ ఐడియా వల్ల తన హోటల్ కి మంచి బ్రాండింగ్ వచ్చిందని తెగ సంబరపోతున్నాడు హోటల్ నిర్వాకుడు.. మీ ఇంట్లో కూడా 5 పైసలుంటే ఈరోజు వెళ్తారేమో ఈ ఆఫర్ నిన్ననే అయిపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..