Fake Sub Collector: నకిలీ సబ్‌ కలెక్టర్‌ గుట్టు రట్టు.. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని మహిళలకు టోకరా.. లక్షల్లో వసూలు

ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు తెరలేపాడు. ఈ క్రమంలో సబ్‌ కలెక్టర్‌ అవతారమెత్తాడు. పోలీసు ఉన్నతాధికారులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని ప్రజలు నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ కేటుగాడు.

Fake Sub Collector: నకిలీ సబ్‌ కలెక్టర్‌ గుట్టు రట్టు.. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానని మహిళలకు టోకరా.. లక్షల్లో వసూలు
Fake Sub Collector
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2022 | 11:53 AM

కాసినో విలాసాలకు అలవాటుపడి డబ్బు కోసం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. కలెక్టర్‌నంటే దొరికిపోతాననుకున్నాడో ఏమో సబ్‌కలెక్టర్‌ని అంటూ కొత్త అవతారం ఎత్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయక మహిళలకు టోకరా వేశాడు. లక్షల్లో కాజేశాడు. మరోసారి ఓ మహిళకు వల వేయబోయి అదే వలలో చిక్కుకున్నాడు ఈ కేటుగాడు. విజయవాడ చిట్టీనగర్ కు చెందిన పిల్లా వెంకట రాజేంద్ర CRDA లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రజల అవసరాలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు తెరలేపాడు. ఈ క్రమంలో సబ్‌ కలెక్టర్‌ అవతారమెత్తాడు. పోలీసు ఉన్నతాధికారులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని ప్రజలు నమ్మించాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ కేటుగాడు.

పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎరగా వేసి దాదాపు 80 లక్షల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానంటూ ఓ మహిళ వద్దనుంచి 9 లక్షల రూపాయలు వసూలు చేసాడంటే ఈ కేటుగాడి మాస్టర్‌ ప్లాన్‌ అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు భూ సెటిల్‌ మెంట్లు చేస్తానని డైరెక్ట్‌ ఫోన్‌లోనే డీల్‌ సెటిల్‌ చేసుకునేవాడు. సబ్‌ కలెక్టర్‌గా ఉన్న తాను త్వరలోనే ప్రమోషన్‌ మీద కలెక్టర్‌ని అవుతున్నానంటూ నమ్మబలికాడు. అంతేకాదు. తనకు జేపీ నడ్డా, శ్రీపతి నాయక్‌తో డైరెక్ట్‌ కనెక్షన్స్‌ ఉన్నాయని వారి రికమెండేషన్‌తో తనను సెంట్రల్‌ అథారిటీలో డైరెక్టర్‌గా వేస్తున్నారని చెప్పాడు.

ఇక ఈ నకిలీ సబ్‌ కలెక్టర్‌ ఫోన్‌లో అన్నీ పోలీసు అధికారులకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లే ఉంటాయి. ఈ కేటుగాడి మోసాన్ని గ్రహించిన ఓ మహిళా బాధితురాలు తన డబ్బులు తిరిగి ఇమ్మని ఇంటికి వెళ్తే తనను బెదిరించాడని వాపోయింది. తనకు పెద్ద పెద్దవాళ్లు తెలుసని, నాపైన కేసు వేసినా రెండు రోజుల్లో తిరిగొస్తానని, మీరే నష్టపోతారంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. అతని భార్య, అత్తగారు తన తమ్ముళ్లపై రేప్ కేసు పెడతానని వార్నింగ్‌ ఇచ్చారని తెలిపింది. తనలాంటి బాధితులో ఇంకా చాలామంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

తిరుమలలో సబ్‌కలెక్టర్‌ హోదాలో స్వామి దర్శనానికి వచ్చారని, అక్కడ పరిచయమైన ఆయన తాను సబ్‌ కలెక్టర్‌ రాజేంద్రనని, ఏదైనా అవసరముంటే ఫోన్‌ చేయాలంటూ తమవద్ద ఫోన్‌ నెంబర్లు తీసుకున్నారనితెలిపింది. నెల తర్వాత ఫోన్ చేసి సివిల్‌ సప్లైయ్స్‌లో కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానని, తాను ప్రభుత్వ ఉద్యోగిన కనుక ఇందులో నావాళ్లు ఉంటే మంచిదంటూ తమ వద్దనుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నాడని తెలిపింది. ఎంతకీ కాంట్రాక్ట్‌ రాకపోయేసరికి నెలరోజుల తర్వాత ఫోన్‌ చేస్తే లిఫ్ట్ చేయడం మానేసాడని వాపోయింది. అనుమానంతో ఎంక్వయిరీకి పంపిస్తే అతని అసలు విషయం బయటపడిందని తెలిపింది.

ఇదిలా ఉంటే సదరు సబ్‌ కలెక్టర్‌గారు మాత్రం తాను ఆ మహిళ వద్ద అప్పుగానే తీసుకున్నానని, తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో వైద్యం కోసం తీసుకున్నానని చెబుతున్నాడు. అంతేకాదు.. త్వరలోనే కొద్ది కొద్దిగా వారి డబ్బులు చెల్లిస్తానని చెబుతున్నాడు. రాజేంద్ర వ్యవహారంపై అనుమానం వచ్చిన మహిళ తన సోదరులను రాజేంద్ర ఇంటికి పంపించగా అతని, భార్య, అతని అత్త వాళ్లను బెదిరించడంతో అతను నకిలీ అని తెలుసుకుంది. అంతే కాదు, రాజేందర్‌పై పలు పోలీస్‌ స్టేషన్లలో చాలా కేసులు ఉన్నట్లు తెలుసుకున్న మహిళ పక్కా ప్లాన్‌వేసి, గ్రామస్తుల సహకారంతో నకిలీ సబ్‌ కలెక్టర్‌ గుట్టు బయటపెట్టింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..