ISRO: ఈ ఏడాది ఆఖరి ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. పీఎస్‌ఎల్వీ సీ-54 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ISRO: ఈ ఏడాది ఆఖరి ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. పీఎస్‌ఎల్వీ సీ-54 కౌంట్‌డౌన్‌ ప్రారంభం
Pslv C54
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2022 | 11:57 AM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమయింది. శనివారం (నవంబరు 26)న ఉదయం 11.56 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54/EOS-06 ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించిన అనుసంధాన ప్రక్రియను రెండు రోజుల క్రితం చేపట్టిన శాస్త్రవేత్తలు తాజాగా రిహార్సల్స్ ను విజయవంతంగా పూర్తి చేశారు. కాగా ఈ ఉదయం 10.26 నిమిషాలకి రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. రేపు సరిగ్గా 11.56 గంటలకు రాకెట్ ప్రయోగం చేయనున్నట్టు ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-54 రాకెట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామన్నారు.

కాగా డిసెంబర్ నెలలో అగ్నికుల్ ప్రయివేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్‌ తెలిపారు. అలాగే 2023 ఫిబ్రవరి నెలలో జీఎస్ఎల్వీ – మార్క్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నామన్నారు. కాగా కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యాక రాకెట్‌ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్‌ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ సిరీస్‌లో 56వ ప్రయోగం. అలాగే ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..