Cyclone Alert: ఏపీ వాసులకు అలర్ట్.. దూసుకొస్తున్న మాండూస్. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండూస్ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాండూస్ తుపాను తీరం వైపు దూసుకొస్తోంది. తుపాను దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలవైపు వేగంగా దూసుకొస్తోందని వాతావరణ వాఖ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. తుపాను తీరాన్ని తాకే క్రమంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ జవహర్‌రెడ్డి సూచించారు. తుపాను పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో 10వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో దక్షిణకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా రహదారులకు కానీ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థకు కానీ ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..