AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు మద్దతుతో మందుబాబుల హల్‌చల్‌ !

కర్నూలు జిల్లా నంద్యాలలో మందుబాబులు రెచ్చిపోయారు. పబ్లిక్‌గా మద్యం సేవిస్తూ..వచ్చేపోయే వారిని ఇబ్బందులకు గురిచేశారు. తప్పతాగి తప్పని చెప్పిన వారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. వారికి సపోర్టుగా పోలీసు యూనిఫామ్‌లో ఉన్న మరో వ్యక్తి కూడా నానా హంగామా చేశాడు. నంద్యాల పట్టణంలోని బాబుల్ రెడ్డి బిల్డింగ్ వద్ద కొందరు యువకులు మద్యం సేవిస్తూ హల్‌చల్‌ చేశారు. ఇంతలోనే స్థానికంగా నివాసముంటున్న ఇంతియాజ్‌ అనే వ్యక్తి అటుగా రావటంతో అతనితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య […]

పోలీసు మద్దతుతో మందుబాబుల హల్‌చల్‌ !
Pardhasaradhi Peri
|

Updated on: Dec 10, 2019 | 8:09 PM

Share
కర్నూలు జిల్లా నంద్యాలలో మందుబాబులు రెచ్చిపోయారు. పబ్లిక్‌గా మద్యం సేవిస్తూ..వచ్చేపోయే వారిని ఇబ్బందులకు గురిచేశారు. తప్పతాగి తప్పని చెప్పిన వారి పట్ల కూడా దారుణంగా ప్రవర్తించారు. వారికి సపోర్టుగా పోలీసు యూనిఫామ్‌లో ఉన్న మరో వ్యక్తి కూడా నానా హంగామా చేశాడు. నంద్యాల పట్టణంలోని బాబుల్ రెడ్డి బిల్డింగ్ వద్ద కొందరు యువకులు మద్యం సేవిస్తూ హల్‌చల్‌ చేశారు. ఇంతలోనే స్థానికంగా నివాసముంటున్న ఇంతియాజ్‌ అనే వ్యక్తి అటుగా రావటంతో అతనితో గొడవకు దిగారు.
ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇంతియాజ్‌ తండ్రి మస్తాన్‌వలి, అతని భార్య మరో కుమారుడిపై మందుబాబులు రెచ్చిపోయి ప్రవర్తించారు. రాళ్లతో దాడికి దిగారు. అయితే, జరిగిన ఘటనలో మందుబాబులకు తోడుగా నంద్యాల పోలీస్‌ సబ్‌డివిజన్‌కు సంబంధం లేని ఓ కానిస్టేబుల్‌ కూడా తాగుబోతులకు మద్దతుగా ప్రవర్తించాడు. గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది.. ఈ దాడిలో మస్తాన్‌వలి తలకు తీవ్ర గాయం కావడంతో అతన్ని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. వివాదానికి కారణమైన ఇద్దరు యువకులను టుటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కానిస్టేబుల్‌ వ్యవహారంపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌