ఏపీ సర్కార్ పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ఈనెల 25వ తేదీ నుంచి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్
ఏపీ ప్రభుత్వం పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 25వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం...
ఏపీ ప్రభుత్వం పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈనెల 25వ తేదీన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ కాకినాడ, శ్రీకాళహస్తి, విజయనగరం జిల్లాల్లో పాల్గొననున్నారు. 25న కాకినాడ, 28న శ్రీకాళహస్తి, 30న విజయనగరం జిల్లాల్లో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
కాగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పేదలకు ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి ఉపయోగపడే పథకాలను ప్రవేశపెడుతూ వచ్చారు. వృద్ధులు, నిరుపేదల నుంచి విద్యార్థుల వరకు అన్ని రకాల పథకాలను ప్రవేశపెడుతూ అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు చేస్తుండటంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.