పాకలోని గొర్రెల మందపై చిరుత పంజా, హృదయ విదారక దృశ్యాలు, రక్తం మడుగులో విగత జీవులుగా మూగజీవాలు
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామ సమీపంలో దారుణం నెలకొంది. పాకలో ఉన్న గొర్రెల మందపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది...
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామ సమీపంలో దారుణం నెలకొంది. పాకలో ఉన్న గొర్రెల మందపై చిరుతపులి అకస్మాత్తుగా దాడి చేసింది. చిరుతపులి దాడిలో కృష అనే వ్యక్తికి చెందిన 4 గొర్రెల మృతి చెందాయి. రక్తం మడుగులో విగతజీవులుగా పడిఉన్న గొర్రెలమంద దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. చిరుత దాడితో ఖాజీపురం గ్రామస్తులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. గొర్రెల పై చిరుతపులి దాడి చేసిందా లేదా అనే విషయం పై ఆలూరు అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.