Nara Lokesh: ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా మంత్రి లోకేష్.. రాష్ట్ర సమస్యలపై కేంద్రమంత్రులతో భేటీ!
ఇదీ ఏడాదిలో జరిగిన డెవలప్‌మెంట్... అదీ రాబోవు నాలుగేళ్లలో మా కమిట్‌మెంట్ అంటూ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వరుసబెట్టి కేంద్రమంత్రులను కలుస్తూ ఏడాదిలో కూడి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించారు. దీనితో పాటు రాష్ట్రంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు.

ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు ఏపీ మంత్రి నారాలోకేష్. రెండ్రోజుల పర్యటనలో భాగంగా… మొదట ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్‌తో భేటీ అయ్యారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి… యువగళం పుస్తకాన్ని అందజేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. ఆతర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి. రాబోవు నాలుగేళ్లపాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆయనకు వివరించారు. అమిత్‌షాకి కూడా యువగళం పుస్తకాన్ని అందేశారు లోకేష్.
ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారితో భేటీ అయ్యాను. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించాను. కర్నూలులో హైకోర్టు బెంచి అన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక, ఇందుకు సహకరించండి. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి… pic.twitter.com/e3zaSumCkj
— Lokesh Nara (@naralokesh) June 18, 2025
అమిత్‌షాతో భేటీ అనంతరం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మీట్ అయ్యింది లోకేష్ అండ్ టీమ్. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలపై ధర్మేంద్ర ప్రధాన్‌తో లోకేష్ బృందం చర్చించింది. లెర్నింగ్ అవుట్ కమ్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు లోకేష్ తెలిపారు. ఆ తర్వాత మరో కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌నూ లోకేష్ టీమ్ కలిసింది. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు… సహకరించాలని చిరాగ్ పాశ్వాన్‌ను లోకేష్ కోరారు. ఆ తర్వాత మరో సెంట్రల్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘావాల్‌తోనూ సమావేశమ్యారు లోకేష్. ఏపీ రాష్ట్ర పురోగతిపై ఆయనతో చర్చించారు.
ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను న్యూడిల్లీలో కలిశాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న సంస్కరణలను వివరించాను. ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.… pic.twitter.com/KsNnzu7BKW
— Lokesh Nara (@naralokesh) June 18, 2025
ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ గారిని కలిశాను. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరాను. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక రాయలసీమ రైతులు… pic.twitter.com/OUjDtkv8U3
— Lokesh Nara (@naralokesh) June 18, 2025
ఇక గురువారం కూడా మంత్రి లోకే ఢిల్లీలోనే ఉండనున్నారు. గురువారం మంత్రిలోకే కేంద్రమంత్రి మాండవియాతో సమావేశం కానున్నారు ఆ తర్వాత యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌నూ ఆయన కలవనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




